ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొబ్బట్లు

ABN, First Publish Date - 2018-03-17T21:02:02+05:30

మైదా, ఉప్పు, నూనె, నీళ్లు అన్నీ ఒక పాత్రలో వేసి ముద్దలా కలపాలి. దీనిపై మరో టేబుల్‌స్పూను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
పిండిముద్దకి: మైదా- ఒక కప్పు, ఉప్పు- చిటికెడు, నూనె, నీళ్లు- ఒక్కొక్కటి మూడు టేబుల్‌స్పూన్లు చొప్పున.
స్టఫ్ఫింగ్‌ కోసం: శెనగపప్పు, బెల్లం- ఒక్కొక్కటి ముప్పావు కప్పు, కొబ్బరి-పావుకప్పు.
 
తయారీవిధానం
 
మైదా, ఉప్పు, నూనె, నీళ్లు అన్నీ ఒక పాత్రలో వేసి ముద్దలా కలపాలి. దీనిపై మరో టేబుల్‌స్పూను నూనె వేసి మూతపెట్టి మూడుగంటలసేపు నానబెట్టాలి. శెనగపప్పును వేగించి ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించాలి. ఉడికిన శెనగపప్పు (నీళ్లు ఉండకుండా జాగ్రత్తపడాలి), బెల్లం, కొబ్బరిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేయాలి.
మైదాపిండిని నిమ్మకాయ సైజు ఉండలుగా చేయాలి. ఈ ముద్దల్ని చిన్నచిన్న పూరీల్లా ఒత్తాలి. వీటి మధ్యలో పూర్ణం పెట్టి నాలుగువైపుల నుంచి మూయాలి. తర్వాత పూర్ణం నింపిన ఉండల్ని పెద్దవిగా, పలచగా ఒత్తాలి. సన్నని మంటపై తవా వేడిచేయాలి. దాని మీద నెయ్యి వేసి బొబ్బట్లను బంగారు రంగులోకి వచ్చేదాకా కాల్చాలి. అలానే రెండవ వైపు కూడా కాల్చాలి. ఇలానే మిగతా వాటిని కూడా కాల్చాలి.

Updated Date - 2018-03-17T21:02:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising