ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమ్లా ఊరగాయ

ABN, First Publish Date - 2018-12-01T20:35:59+05:30

ఉసిరికాయలను నీళ్లతో కడిగి ఆరబెట్టాలి. పెద్ద పాన్‌ తీసుకుని అందులో నువ్వుల నూనె వేడిచేయాలి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
ఉసిరికాయలు - ఒక కిలో, ఉప్పు - అరకప్పు, పసుపు - ఒక టీస్పూను, నువ్వుల నూనె - ముప్పావు కప్పు, కారంపొడి - అరకప్పు, ఇంగువ - ఒక టీస్పూను, మెంతిపొడి - పావు కప్పు, నిమ్మకాయలు- నాలుగు (మధ్యస్థంగా ఉండే సైజులో), ఆవాలు- అర టీస్పూను.
 
తయారీవిధానం
 
ఉసిరికాయలను నీళ్లతో కడిగి ఆరబెట్టాలి. పెద్ద పాన్‌ తీసుకుని అందులో నువ్వుల నూనె వేడిచేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, ఇంగువ వేయాలి.
ఆవాలు చిటపటలాడడం మొదలవ్వగానే ఆ నూనెలో ఉసిరికాయలు వేసి మెత్తబడేవరకూ మూతపెట్టి స్టవ్‌ మీద సన్నని మంటపై ఉంచాలి. పాన్‌లోని ఉసిరికాయలు మెత్తబడిన తర్వాత బాండీలోని నీళ్లు ఇంకిపోయేవరకూ స్టవ్‌ మీద ఉడికించాలి. పాన్‌లోని మిగిలిన నీళ్లు కూడా పూర్తిగా ఆవిరైన తర్వాత స్టవ్‌ మీద నుంచి దించి ఉసిరికాయలను చల్లారనివ్వాలి. చల్లారిన ఉసిరికాయల్లో ఉప్పు, కారం, పసుపు, మెంతిపొడి వేయాలి. అందులో నిమ్మరసం పిండి మొత్తం మిశ్రమన్ని బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని మూడు రోజులు అలాగే జాడీలో నాననివ్వాలి. ఇలా చేస్తే స్పైసినీ ఉసిరికాయలు బాగా పీల్చుకుంటాయి. అప్పుడు వాటిని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. దీనిని గాజు జార్‌లో పెట్టి గట్టిగా మూతపెట్టి వాడుకోవాలి. మూడు నాలుగు నెలలు ఈ ఊరగాయ నిలువ ఉంటుంది.

Updated Date - 2018-12-01T20:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising