ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్‌ మిఠాయి

ABN, First Publish Date - 2018-11-03T18:41:02+05:30

కోవా - ఒకటిన్నర కేజీ, చక్కెర పౌడర్‌ - అర కేజీ, చక్కెర - అర కేజీ, టార్టారిక్‌ యాసిడ్‌ - పది గ్రాములు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
కోవా - ఒకటిన్నర కేజీ, చక్కెర పౌడర్‌ - అర కేజీ, చక్కెర - అర కేజీ, టార్టారిక్‌ యాసిడ్‌ - పది గ్రాములు, పాలు - అర కప్పు, గసగసాలు - 50 గ్రాములు, నెయ్యి- గ్రీజింగ్‌కు.
 
తయారీవిధానం
 
లోతు ఎక్కువగా ఉండే పాన్‌ తీసుకోవాలి. అందులో చక్కెర (క్రిస్టల్స్‌), టార్టారిక్‌ యాసిడ్‌, లీటరు నీళ్లు పోసి సన్నని మంటపై మరిగించాలి. చక్కెర నీళ్లల్లో కరిగాక అందులో కొద్దిగా పాలు పోసి పాకం చెయ్యాలి. ఈ పాకాన్ని రెండు భాగాలు చేయాలి.
పాన్‌లో ఉన్న సగం పాకంలో చక్కెర పౌడర్‌, కోవా వేసి సన్నని మంటపై చాక్లెట్‌ రంగులోకి వచ్చేదాకా ఉడికించాలి. ఒక ట్రే తీసుకుని దానిపై నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని అందులో పోయాలి. ఆ మిశ్రమం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్‌ చేయాలి.
మిగిలిన రెండో భాగం పాకాన్ని సన్నని మంటపై వేడిచేయాలి. అందులో గసగసాలు వేసి వాటికి పాకం బాగా పట్టేలా చూసుకోవాలి. పాకంపట్టిన గసగసాలను జల్లెడ పట్టి ప్లేటులో పెట్టాలి. కట్‌ చేసి పెట్టుకున్న బర్ఫీ ముక్కలను ప్లేటులో ఉంచిన పాకం పట్టిన గసగసాల్లో పొర్లించాలి. ఇలా చేయడం వల్ల పాకం గసగసాలు బర్ఫీ ముక్కలకు అతుక్కుంటాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ బాల్‌ మిఠాయి టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2018-11-03T18:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising