ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమ్లా క్యాండీ

ABN, First Publish Date - 2018-12-01T20:17:35+05:30

ఉసిరి కాయలు నీటిలో మునిగేలా పెద్ద పాన్‌లో నీళ్లు తీసుకుని మరిగించాలి. ఆ నీళ్లల్లో ఉసిరి కాయలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
ఆమ్లా - అర కిలో, చక్కెర - 350 గ్రాములు.
 
తయారీవిధానం
 
ఉసిరి కాయలు నీటిలో మునిగేలా పెద్ద పాన్‌లో నీళ్లు తీసుకుని మరిగించాలి. ఆ నీళ్లల్లో ఉసిరి కాయలు వేసి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్‌ ఆపేయాలి. ఆ వేడి నీళ్లల్లో ఉసిరికాయలను మరో రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత వేడి నీళ్లల్లోంచి వాటిని బయటకు తీసి చల్లారనివ్వాలి. చల్లారిన ఉసిరికాయలను గింజలు తీసేసి చిన్న ముక్కలుగా తరగాలి. పెద్ద గిన్నె తీసుకుని అందులో ఉసిరికాయముక్కలు, చక్కెర పాకం వేసి ఒకదాంట్లో ఒకటి బాగా కలిసిపోయేలా మూడు రోజుల పాటు వాటిని అలాగే ఉంచాలి. అయితే రోజుకొకసారి ఆ ముక్కలను పాకంతోపాటు కలపడం మర్చిపోవద్దు. మెల్లగా చక్కెరపాకంపై ఉసిరిముక్కలు తేలతాయి. నాల్గవ రోజు ఉసిరి ముక్కలు గిన్నె అడుగుకు చేరతాయి. ఆ ముక్కలను చిల్లుల గరిటెతో తీసి రెండు మూడు రోజులు ఎండనివ్వాలి. ఎండిన ఉసిరిముక్కలపై చక్కెరపొడిలా పేరుకుంటుంది.
చక్కెరపాకంతో ఎండిన ఉసిరి ముక్కలను గాజు సీసాలో పెట్టి ఏడాది పొడుగునా తినొచ్చు. ఈ ఆమ్లా క్యాండీలు భలే రుచిగా ఉంటాయి.

Updated Date - 2018-12-01T20:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising