ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మామిడికాయ పుల్లటి నువ్వుల పచ్చడి

ABN, First Publish Date - 2018-03-31T21:40:56+05:30

పచ్చిమామిడికాయ - ఒకటి (తొక్క తీసి, తురిమి), పసుపు - పావు టీస్పూను, నువ్వులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
పచ్చిమామిడికాయ - ఒకటి (తొక్క తీసి, తురిమి), పసుపు - పావు టీస్పూను, నువ్వులు - అరకప్పు (సన్నని మంటపై నూనె లేకుండా దోరగా వేగించాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేయాలి), ఆవాలు - అర టీస్పూను (పొడి చేసి), మెంతులు - పావు టీస్పూను (నూనె వేయకుండా ఎర్ర గా వేగించి, పొడిలా చేయాలి), ఉప్పు- రుచికి
సరిపడా.
తాలింపు కోసం: నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఆవాలు- అర టీస్పూను, జీలకర్ర - ఒక టీస్పూను, ఎండుమిర్చి - ఏడు (గింజలు లేకుండా చిన్న ముక్కలుగా తుంపి), ఇంగువ - చిటికెడు, కరివేపాకు - గుప్పెడు.
 
తయారీవిధానం
 
లోతైన కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకులు వేగించాలి. అందులో మామిడి తురుము, పసుపు వేయాలి. నూనె పైకి తేలేంతవరకూ సన్నని మంటపై మూతపెట్టకుండా ఉడికించాలి. తరువాత నువ్వుల పొడి వేసి బాగా కలిపి ఒక నిమిషం స్టవ్‌ మీదే ఉంచాలి. మెంతిపొడి, ఆవాలపొడి, ఉప్పు వేసి కలిపి స్టవ్‌ ఆపేయాలి. వేడి అన్నంలో ఈ పచ్చడి కలిపి, నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు.

Updated Date - 2018-03-31T21:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising