ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మామిడికాయ రసం

ABN, First Publish Date - 2018-03-31T21:38:07+05:30

దోర మామిడికాయ - ఒకటి, నల్ల మిరియాల పొడి - అర టీస్పూను, కారం - అర టీస్పూను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
దోర మామిడికాయ - ఒకటి, నల్ల మిరియాల పొడి - అర టీస్పూను, కారం - అర టీస్పూను, జీలకర్ర పొడి, ధనియాలపొడి - ఒక్కోటి ఒక్కో స్పూను చొప్పున, పసుపు - అర టీస్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూను, కొత్తిమీర తరుగు - కొద్దిగా.
తాలింపు కోసం: నెయ్యి, ఆవాలు - ఒక్కొక్కటి ఒక్కో అర టీస్పూను, జీలకర్ర - ఒక టీస్పూను, కరివేపాకు - ఒక రెబ్బ, ఇంగువ - చిటికెడు, వెల్ల్లుల్లి రెబ్బలు - మూడు.
 
తయారీవిధానం
 
మామిడికాయను బాగా కడిగి, కుక్కర్‌లో ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. చల్లారాక గుజ్జును పిండి, రసాన్ని వడకట్టాలి. పాన్‌లో నెయ్యి వేడి చేసి ఆవాలు, ఇంగువ, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండు మిర్చిలను వేసి వేగించాలి. మామిడి రసంలో మిరియాలపొడి, పసుపు, కారం, జీలకర్ర, ధనియాలపొడి వేసి కలపాలి. చిక్కగా ఉంటే కొన్ని నీళ్లు కలపొచ్చు. నిమ్మరసం పిండి మామిడి రసాన్ని స్టవ్‌ మీద ఐదునిమిషాలు ఉడికించాలి. సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేయాలి. వేడివేడి మామిడి రసాన్ని అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-03-31T21:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising