ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోఫ్తా కర్రీ

ABN, First Publish Date - 2018-11-10T21:31:19+05:30

కీమా - 450 గ్రా., కోఫ్తా తయారీ కోసం: ఉల్లితరుగు, కొత్తిమీర - పావు కప్పు చొప్పున, పెరుగు - ఒక టేబుల్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
కీమా - 450 గ్రా., కోఫ్తా తయారీ కోసం: ఉల్లితరుగు, కొత్తిమీర - పావు కప్పు చొప్పున, పెరుగు - ఒక టేబుల్‌ స్పూను, మైదా - 4 టేబుల్‌ స్పూన్లు, జీరా పొడి - 2 టీ స్పూన్లు, గరం మసాల, పసుపు, ధనియాల పొడులు - ఒక్కో టీ స్పూను చొప్పున, పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూను, మెదిపిన లవంగాలు 2, ఆవాలు - పావు టీ స్పూను, గుడ్డు - ఒకటి, ఉప్పు, మిరియాల పొడి - రుచికి సరిపడా. కర్రీ సాస్‌ కోసం: బటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి తరుగు - పావు కప్పు, మెదిపిన వెల్లుల్లి - 2, కర్రీపొడి - 3 టేబుల్‌ స్పూన్లు, యాలకులు - 4, మటన్‌ స్టాక్‌ - 600 మి.లీ., టమోటా గుజ్జు - ఒక టేబుల్‌ స్పూను, పెరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు - ఒక టేబుల్‌ స్పూను.
 
తయారుచేసే విధానం
 
ఒక వెడల్పాటి లోతైన పాత్రలో కీమాతో పాటు కోఫ్తా తయారీ పదార్థాలన్నీ వేసి చేత్తో బాగా కలిపి నిమ్మకాయ సైజులో ఉండలు తయారుచేసి పక్కనుంచాలి. ఇప్పుడు పాన్‌లో బటర్‌ వేసి ఉల్లి తరుగు వేగించి మంట తగ్గించి కర్రీ పొడి, యాలకులు వేయాలి. తర్వాత టమోటా గుజ్జు, పెరుగు, కొత్తిమీర తరుగు వేసి పది నిమిషాల తర్వాత కోఫ్తా (ఉండలు) వేయాలి. మూత పెట్టకుండా 20 నిమిషాలు అలాగే ఉంచి ఒకసారి పాన్‌ కదిలించాలి. తర్వాత మటన్‌ స్టాక్‌ పోసి ఉండలు ఉడికి, గ్రేవీ చిక్కబడ్డాక దించేయాలి.

Updated Date - 2018-11-10T21:31:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising