ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగ్‌ ఘోష్‌

ABN, First Publish Date - 2018-08-19T18:10:08+05:30

మటన్ కైమా : అరకేజీ, పాలకూర : కట్ట, నూనె : మూడు టేబుల్‌ స్పూన్‌లు, ఉల్లిపాయలు : మూడు (పేస్టు చేసుకోవాలి), అల్లం వెల్లుల్లి పేస్టు : మూడు చెంచాలు, టమోటా ప్యూరీ : రెండు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
మటన్ కైమా : అరకేజీ, పాలకూర : కట్ట, నూనె : మూడు టేబుల్‌ స్పూన్‌లు, ఉల్లిపాయలు : మూడు (పేస్టు చేసుకోవాలి), అల్లం వెల్లుల్లి పేస్టు : మూడు చెంచాలు, టమోటా ప్యూరీ : రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు : సరిపడా, జీలకర్ర : ఒక స్పూన్, ధనియాల పొడి : ఒక స్పూన్, కారం : అర చెంచా, గరం మసాలా : అరచెంచా
 
తయారు చేసే విధానం
 
పాలకూరను ఉడికించుకుని తర్వాత మెత్తని పేస్టులా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ పేస్టును వేయాలి. అందులోని పచ్చివాసన పోయి అది వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించు కోవాలి. ఇందులో మటన్ కైమా, కారం, గసగసాలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. మంట తగ్గించి మధ్య మధ్య కలుపుతూ మాంసం ఉడికిన తర్వాత జీలకర్రపొడి, ధనియాలపొడి, టమాటో ప్యూరీ, ఉడికించిన పాలకూర ముద్ద వేసి కలపాలి. కొద్దిసేపయ్యాక గరంమసాలా వేసి దించేస్తే సాగ్‌ ఘోష్‌ రెడీ.. దీన్ని అన్నంలో గానీ చపాతీలో గానీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-08-19T18:10:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising