ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లి నిహారీ

ABN, First Publish Date - 2018-06-16T19:21:05+05:30

మటన్‌-500 గ్రాములు, నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, నిహారీ మసాలా- రెండున్నర టేబుల్‌స్పూన్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
మటన్‌-500 గ్రాములు, నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, నిహారీ మసాలా- రెండున్నర టేబుల్‌స్పూన్లు, బాగా వేగించిన ఉల్లిపాయముక్కలు- ఒక కప్పు, ఉప్పు-రుచికి సరిపడా, గోధుమపిండి- రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం-చిన్నముక్క (సన్నగా తరిగి).
 
తయారీవిధానం
 
పెద్ద పాన్‌లో నెయ్యి వేసి వేడిచేయాలి. అందులో మటన్‌ ముక్కలు వేసి పెద్ద మంటపై అవి ముదురురంగులోకి వచ్చే దాకా అటు ఇటు కలుపుతుండాలి. మటన్‌ ముక్కల్లో నీహారీ మసాలా వేసి రెండునిమిషాలు వేగించాలి. వేగిన ఉల్లిపాయముక్కలను కూడా ఇందులో వేసి కాసేపు కలపాలి. తర్వాత రెండు కప్పులు నీళ్లు, తగినంత ఉప్పు అందులో వేసి పాన్‌పై మూతపెట్టి ఉడకనివ్వాలి. మటన్‌ముక్కలు బాగా మెత్తబడేంత వరకూ ఉడికించాలి. కప్పులో సగం వరకూ నీళ్లు తీసుకుని అందులో గోధుమపిండిని ఉండలు లేకుండా పేస్టులా కలపాలి. మిగిలిన వేగించిన ఉల్లిపాయలను, గోధుమపిండి నీళ్లను మటన్‌లో పోసి కలపాలి. గ్రేవీ చిక్కబడేవరకూ స్టవ్‌పై ఉడికించాలి. తర్వాత అందులో అల్లం ముక్కలు వేసి ఎముకల నుంచి మటన్‌ గుజ్జు విడిపోయేవరకూ ఉడికించాలి. ఈద్‌ ప్రత్యేకత అయిన నల్లి నిహారీ రుచి అద్భుతంగా ఉంటుంది.

Updated Date - 2018-06-16T19:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising