ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీక్‌ కబాబ్స్‌

ABN, First Publish Date - 2018-06-16T19:19:35+05:30

కీమా-150గ్రాములు, చికెన్‌- 100గ్రాములు(చిన్నముక్కలుగా), అల్లంవెల్లుల్లి పేస్టు-రెండు టీస్పూన్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
కీమా-150గ్రాములు, చికెన్‌- 100గ్రాములు(చిన్నముక్కలుగా), అల్లంవెల్లుల్లి పేస్టు-రెండు టీస్పూన్లు, ఉల్లిపాయపేస్టు, కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, ఆమ్‌చూర్‌-ఒక్కొక్కటీ ఒక్కో టీస్పూను, మిరియాలపొడి-ముప్పావు టీస్పూను, ఎండుఅల్లంపొడి-పావు టీస్పూను, నూనె-రెండు టీస్పూన్లు, జీడిపప్పు పేస్టు- ఒకటిన్నర టేబుల్‌స్పూను, మీగడ-ఒకటిన్నర టేబుల్‌స్పూను, శెనగపిండి-రెండు టేబుల్‌స్పూన్లు, గుడ్డుసొన ఒకటి, ఉప్పు-తగినంత, పైనచల్లడానికి- గుప్పెడు కొత్తిమీరతురుము.
 
తయారీవిధానం
 
ఒక పాత్రలో కీమా, చికెన్‌ముక్కలు వేసి బాగా కలపాలి. అల్లం-వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాలపొడి, ఆమ్‌చూర్‌, ఎండుఅల్లం పొడి, నూనె, జీడిపప్పు పేస్టు, మీగడ అందులో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కోడిగుడ్డు సొన, శెనగపిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి పిండి అతుక్కుని ఉండేలా కలపాలి. ఈ మిశ్రమంపై మూతపెట్టి ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచాలి. తర్వాత దాన్ని బయటకు తీసి స్ర్క్యూయర్స్‌కు నూనె పట్టించి పిండిని చిన్న ఉండలు మాదిరి చేసి వాటికి గుచ్చి బంగారు వర్ణం వచ్చేవరకూ వాటిని గ్రిల్‌ చేయాలి. గ్రిల్‌ అయ్యేటప్పుడు కబాబ్స్‌పై మధ్య మధ్యలో నూనెను చిలకరిస్తుండాలి. కబాబ్స్‌ మెత్తబడ్డాక స్ర్క్యూయర్స్‌ నుంచి తీసి ప్లేటులో పెట్టాలి. వాటిని ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలతో అలంకరించాలి. తర్వాత కబాబ్స్‌పై కొత్తిమీర చల్లి తింటే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2018-06-16T19:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising