ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీర దోసకాయ అల్లం లెమనేడ్‌

ABN, First Publish Date - 2018-03-07T18:35:07+05:30

కీర దోసకాయ (గింజలు తీసి, సన్నటి ముక్కలుగా తరిగి) - రెండు కప్పులు, నిమ్మకాయలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
కీర దోసకాయ (గింజలు తీసి, సన్నటి ముక్కలుగా తరిగి) - రెండు కప్పులు, నిమ్మకాయలు (రసం తీసి) - రెండు, తేనె - రెండు టేబుల్‌ స్పూన్లు, పుదీనా కట్ట - ఒకటి(చిన్నది), అల్లం (తరిగి) - చిన్న ముక్క, సోడా నీళ్లు - 150 మిల్లిలీటర్లు, మంచి నీళ్లు - అవసరం అనుకుంటే, ఉప్పు - చిటికెడు (ఇష్టపడితే).
 
తయారీవిధానం
 
కుకుంబర్‌, జింజర్‌ మింట్‌ లెమనేడ్‌ తయారీకోసం కీర దోస తరుగు, నిమ్మరసం, తేనె, అల్లం, మంచినీళ్లు బ్లెండర్‌లో వేసి కీరదోసకాయ గుజ్జులా అయ్యే వరకు మిక్స్‌ చేయాలి.
ఈ మిశ్రమాన్ని వడకట్టి, మట్టి పాత్రలో పోయాలి. అందులో సోడా, పుదీనా, కీరదోస ముక్కలు, నిమ్మ చెక్కలు, కీరదోస మిశ్రమం వేసి బాగా కలపాలి. రుచి చూసి అవసరమైతే నిమ్మరసం కలుపుకోవచ్చు, తేనె, ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టు కలుపుకోవచ్చు. తయారైన రెసిపీని పుదీనా ఆకులతో అలంకరించి తాగితే రుచిగా ఉండడమే కాదు వేసవి సూర్య తాపాన్ని క్షణాల్లో మాయం చేసి తాజాదనాన్ని ఇస్తుంది.

Updated Date - 2018-03-07T18:35:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising