ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొలకల కూర్మా

ABN, First Publish Date - 2018-09-08T19:45:03+05:30

పెసల మొలకలు - ఒకటిన్నర కప్పు, టొమాటో, ఉల్లిపాయముక్కలు - ఒక్కొక్కటీ ఒక్కో అరకప్పు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
పెసల మొలకలు - ఒకటిన్నర కప్పు, టొమాటో, ఉల్లిపాయముక్కలు - ఒక్కొక్కటీ ఒక్కో అరకప్పు, పచ్చిమిర్చి - ఒకటి (సన్నగా తరిగి), అల్లం పేస్టు-ఒక టీస్పూను, కరివేపాకు రెబ్బ - ఒకటి, జీలకర్ర - అర టీ స్పూను, ఆవాలు - పావు టీస్పూను (కావాలనుకుంటే), కారం - అర టీస్పూను, ఉప్పు - తగినంత, పసుపు - సరిపడా, ధనియాలపొడి- ముప్పావు టీస్పూను, కొత్తిమీర - రెండు టేబుల్‌ స్పూన్లు, నీళ్లు - ముప్పావు కప్పు, నూనె - రెండు టీస్పూన్లు.
 
తయారీవిధానం
 
చిన్న పాత్రలో నూనె వేడిచేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడేటప్పుడు అందులో అల్లంపేస్టు, కరివేపాకు వేయాలి. అల్లం సువాసన వచ్చేదాకా వేగించాలి. అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త ఉప్పు చల్లాలి. బంగారువర్ణం వచ్చేదాకా దాన్ని వేగించాలి. అందులో టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. టొమాటో ముక్కల్లో ఉల్లిపాయలు కలిసిపోయి మెత్తగా అయ్యేదాకా సన్నని మంటపై ఉడకనివ్వాలి. అందులో పెసర మొలకలు, కారం, ధనియాలపొడి వేసి కలిపి రెండు నిమిషాలు వేగించాలి.
ఈ మిశ్రమం ఉడకడానికి కొద్దిగా నీళ్లు (పెసలు నానబెట్టినవి కాబట్టి) పోయాలి.
పెసర మొలకలు మెత్తబడాలి. దగ్గరపడిన మొలకల కర్రీని కిందికి దించి దానిమీద కొత్తిమీర చల్లాలి. ఈ కూర్మాను వేడి వేడి అన్నంతో లేదా చపాతీలతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-09-08T19:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising