ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షెజ్‌వాన్‌ ఫ్రైడ్‌ రైస్‌

ABN, First Publish Date - 2018-07-07T16:44:56+05:30

వెజిటబుల్‌ ఆయిల్‌-రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లిపాయముక్కలు- ఒక టీస్పూను, సన్నగా తరిగిన ఆకుకూరలు-రెండు టేబుల్‌స్పూన్లు, కాయగూరముక్కలు-ఒకటిన్నర కప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: వెజిటబుల్‌ ఆయిల్‌-రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లిపాయముక్కలు- ఒక టీస్పూను, సన్నగా తరిగిన ఆకుకూరలు-రెండు టేబుల్‌స్పూన్లు, కాయగూరముక్కలు-ఒకటిన్నర కప్పు (పుట్టగొడుగులు, బీన్స్‌, కారెట్‌, మొక్కొజొన్నలు, పచ్చి బటాణీలు లాంటివి), చద్ది అన్నం- మూడు కప్పులు, షేజ్‌వాన్‌ సాస్‌-మూడు టేబుల్‌స్పూన్లు, సోయా సాస్‌-ఒక టేబుల్‌స్పూను, ఉప్పు, మిరియాలపొడి-రుచికి సరిపడా, గ్రీన్‌ ఉల్లిపాయముక్కలు, నువ్వుపప్పు- టాపింగ్‌కి.
 
తయారీ: పాన్‌ని పొయ్య మీద వేడిచేయాలి. అందులో నూనె, ఆకుకూరల తరుగు, వెల్లుల్లి ముక్కలు వేయాలి. 30 సెకన్లపాటు దీన్ని ఉడికించిన తర్వాత కూరగాయ ముక్కలను అందులో వేసి బాగా కలపాలి. కూరగాయముక్కలను పెద్దమంట మీద రెండు మూడు నిమిషాలు వేగనిచ్చి అందులో షేజ్‌వాన్‌ సాస్‌, సోయా సాస్‌, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. రెడీగా పెట్టుకున్న మూడు కప్పుల అన్నం అందులో కలపాలి. అన్నం మీద సాస్‌ చల్లి మరో రెండు నిమిషాలు స్టవ్‌పై ఉంచాలి. ఫ్రైడ్‌ రైస్‌ పొడిపొడిలాడుతుంటే దాన్ని స్టవ్‌పై నుంచి దించి గ్రీన్‌ ఉల్లిపాయముక్కలు, నువ్వులు దానిపై చల్లాలి. రెడీ అయిన ఫ్రైడ్‌ రైస్‌ను వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-07-07T16:44:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising