ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉల్లికాడల పులావ్‌

ABN, First Publish Date - 2018-02-03T21:43:01+05:30

బాస్మతి బియ్యం- ఒక కప్పు, ఉల్లికాడల తరుగు - మూడు కప్పులు, సోంపు - ఒక టీస్పూను, జీడిపప్పులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
బాస్మతి బియ్యం- ఒక కప్పు, ఉల్లికాడల తరుగు - మూడు కప్పులు, సోంపు - ఒక టీస్పూను, జీడిపప్పులు లేదా బాదం లేదా రెండు కలిపి -రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు- రెండు (కచ్చాపచ్చాగా నూరి), ఉప్పు- తగినంత, చక్కెర- చిటికెడు (ఇష్టముంటే).
 
తయారీవిధానం
 
అన్నం ముద్దకాకుండా పొడిపొడిగా వండి చల్లార్చాలి. అన్నం ఉడికేటప్పుడే కాస్తంత ఉప్పు వేయాలి. జీడిపప్పును పాన్‌లో వేగించి పక్కన పెట్టుకోవాలి. సన్నని మంటపై పాన్‌ ఉంచి వెన్న వేడి చేసి, అందులో సోంపు వేయాలి. అవి వేగాక అందులో ఉల్లికాడల ముక్కలు, వెల్లుల్లి వేయాలి. ఈ మిశ్రమం మెత్తగా అయ్యే వరకూ స్టవ్‌ మీద ఉంచాలి.
కూరను కిందకు దించి చల్లారిన అన్నం, వేగించిన జీడిపప్పు వేసి కలపాలి. చివరిగా పులావ్‌లో ఉప్పు, చక్కెర వేసి కలపాలి. రెడీ అయిన పులావ్‌పై ఉల్లికాడ తరుగు చల్లాలి. దీన్ని వేడిగా తింటే ఎంతో బాగుంటుంది.

Updated Date - 2018-02-03T21:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising