ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాప్సికం-పనీర్‌ మసాలా

ABN, First Publish Date - 2018-02-03T21:41:37+05:30

ఉల్లిపాయ తరుగు - ముప్పావు కప్పు, అల్లం-వెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూను, టొమాటో తరుగు- ఒక కప్పు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
ఉల్లిపాయ తరుగు - ముప్పావు కప్పు, అల్లం-వెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూను, టొమాటో తరుగు- ఒక కప్పు, పనీర్‌ తరుగు- ముప్పావు కప్పు, క్యాప్సికం తరుగు (పెద్ద ముక్కలు)- ఒక కప్పు, జీడిపప్పులు-ఆరు, ఉప్పు- తగినంత.
 
మసాలా పొడికి: పసుపు- పావు టీస్పూను, కారం, గరం మసాలా పొడి- ఒక్కో టీస్పూను చొప్పున, ధనియాలపొడి- ఒకటిన్నర టీస్పూను.
సీజనింగ్‌కు: నూనె- ఒకటిన్నర టేబుల్‌స్పూను, జీలకర్ర- ఒక టీస్పూను.
 
తయారీవిధానం
జీడిపప్పుల్ని వేడినీళ్లల్లో పదిహేను నిమిషాలు నానబెట్టాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి వాటిని గ్రైండ్‌ చేయాలి. కడాయిలో నూనె వేడిచేసి జీలకర్ర, ఉల్లి తరుగు వేసి బంగారురంగుకి వచ్చేవరకూ వేగించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్టు వేసి కాసేపు వేగించాలి. టొమాటో ముక్కలు, పసుపు, ధనియాలపొడి, కారం, గరంమసాలా పొడి వేసి కలపాలి. టొమాటోలు ఉడికాక క్యాప్సికం ముక్కలు ఉడికించాలి. ఆ తర్వాత పనీర్‌ ముక్కలు వేసి మసాలాలో అవి కలిసేవరకూ వేగించాలి. తర్వాత జీడిపప్పు పేస్టు వేసి ఐదు నిమిషాలు ఉంచి ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత స్టవ్‌ మీద నుంచి కడాయి దించి కొత్తిమీర తరుగు చల్లి, పరాఠా, నాన్‌, పులావ్‌, రోటీలంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-02-03T21:41:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising