ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కజొన్న వడలు

ABN, First Publish Date - 2018-07-21T17:31:23+05:30

మొక్కజొన్నలు - రెండు కప్పులు, మక్కపిండి - ఒక కప్పు, అల్లం, వెల్లులి పేస్టు, పచ్చిమిర్చిపేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
మొక్కజొన్నలు - రెండు కప్పులు, మక్కపిండి - ఒక కప్పు, అల్లం, వెల్లులి పేస్టు, పచ్చిమిర్చిపేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా, ఉల్లిపాయముక్కలు - రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - రుచికి సరిపడా, ఉప్పు - రుచికి సరిపడా, ఉడకబెట్టిన మొక్కజొన్నవిత్తులు, ఉల్లిపాయముక్కలు - కొన్ని (అలంకరణకు).
 
తయారీవిధానం
మొక్కజొన్న గింజలను మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేయాలి. ఇందులో మక్కపిండి, అల్లం-వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర తరుగు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. నీళ్లు పోయొద్దు. కడాయిలో నూనె వేడిచేయాలి. వడలను ఫ్లాట్‌గా, మీడియం సైజులో చేసి నూనెలో వేసి బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేగించాలి. వేడి మొక్కజొన్న వడలను పుదీనా చెట్నీతో లేదా టొమాటో చెట్నీ, ఉల్లిపాయముక్కలతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2018-07-21T17:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising