ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దంపుడు బియ్యం పులావ్‌

ABN, First Publish Date - 2018-06-24T20:05:42+05:30

దంపుడు బియ్యం-ఒకకప్పు (నాలుగు గంటలు నీళ్లల్లో నానబెట్టి), తరిగిన కూరగాయముక్కలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
దంపుడు బియ్యం-ఒకకప్పు (నాలుగు గంటలు నీళ్లల్లో నానబెట్టి), తరిగిన కూరగాయముక్కలు-ఒక కప్పు(క్యారెట్‌, కాప్సికం, పచ్చిబటానీలు, బీన్స్‌ లాంటివి), ఉల్లిపాయముక్కలు, తరిగిన టొమాటోముక్కలు - ఒక్కొక్కటీ ఒక్కో అరకప్పు, పల్లీలు-పావుకప్పు, ఆవాలు- ఒక టీస్పూను, కరివేపాకు-ఒక రెబ్బ, నూనె- ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు-రుచికి సరిపడా, పసుపు-అర టీస్పూను, కొత్తిమీర-గుప్పెడు.
 
తయారీవిధానం
 
నానబెట్టిన దంపుడు బియ్యాన్ని 90 శాతం ఉడకనివ్వాలి. పాన్‌లో నూనెపోసి పల్లీలు ఎరుపురంగులోకి వచ్చేదాకా వేగించాలి. పాన్‌లో ఒక టేబుల్‌స్పూను ఆయిల్‌ పోసి వేడెక్కాక అందులో ఆవాలు వేయాలి. అవి చిటపటలాడుతుంటే అందులో కరివేపాకు వేసి వేగించాలి. అందులో ఉల్లిపాయముక్కలు కూడా వేసి కొన్ని నిమిషాలపాటు వేగించాలి. తరిగిపెట్టుకున్న టొమాటో ముక్కలను కూరగాయముక్కలనూ అందులో వేగించాలి. పసుపు, తగినంత ఉప్పు కూడా అందులో కలపాలి. ఉడికిన అన్నాన్ని ఇందులో వేసి బాగా కలిపిన తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి తిరిగి ఉడికించాలి.
ఇలా పోసిన నీళ్లు పూర్తిగా ఆవిరై అన్నం, కూరగాయముక్కలు బాగా ఉడికేదాకా స్టవ్‌పై ఉంచాలి. సిద్ధమైన దంపుడు బియ్యం పులావ్‌పై కొత్తిమీర తరుగు, వేగించిన పల్లీలు చల్లి వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-06-24T20:05:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising