ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెంతికూర పెరుగు

ABN, First Publish Date - 2018-05-05T22:23:37+05:30

పెరుగు- ఒక కప్పు, శెనగపిండి- పావు కప్పు, పసుపు- అర టీస్పూను, ధనియాలపొడి- ఒక టీస్పూను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
పెరుగు- ఒక కప్పు, శెనగపిండి- పావు కప్పు, పసుపు- అర టీస్పూను, ధనియాలపొడి- ఒక టీస్పూను, కారం- పావు టీస్పూను, ఉప్పు- రుచికి సరిపడా.
తాలింపు కోసం: మెంతి కూర- వంద గ్రాములు (బాగా కడిగి సన్నగా తరగాలి), ఉల్లిపాయ-ఒకటి (సన్నగా తరగాలి), జీలకర్ర- పావు టీస్పూను, ఆవాలు- పావు టీస్పూను, ఎండుమిర్చి- రెండు, నెయ్యి- ఒకటిన్నర టేబుల్‌స్పూను.
 
తయారీవిధానం
 
కడాయిలో శెనగపిండి, పెరుగు, పసుపు, ధనియాలపొడి, కారం, ఉప్పులను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో రెండు కప్పుల నీళ్లు పోసి పేస్టులా చేసి, సన్ననిమంటపై ఉంచి ఉడికించాలి. మిశ్రమం ఉండకట్టకుండా గరిటెతో కలపాలి. దీని వల్ల మృదువుగా తయారవుతుంది. పాన్‌లో ఒక టీస్పూను నూనె వేడి చేసి, అందులో ఉల్లిపాయముక్కలను వేగించాలి. తర్వాత అందులో మెంతి వేసి మెత్తగా అయ్యేదాకా వేగించాలి. ఆ తర్వాత స్టవ్‌ ఆపేయాలి. మెంతి, ఉల్లిపాయ మిశ్రమాన్ని కడాయిలో ఉడుకుతున్న కూరలో వేయాలి. సాస్‌ పాన్‌లో నెయ్యి వేసి, వేడెక్కాక జీలకర్ర, ఆవాలను వేయించి, ఇవి చిటపటలాడేటప్పుడు ఎండుమిర్చిని వేయాలి. ఆ తాలింపును కూరలో వేస్తే మెంతి- పెరుగు కూర రెడీ.

Updated Date - 2018-05-05T22:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising