ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మటన్ పాయ

ABN, First Publish Date - 2018-11-10T21:27:43+05:30

పొట్టేలు కాళ్లు (ముక్కలుగా) - 4, ఉల్లిపాయ - 1, వెల్లుల్లి - 12 రేకలు, అల్లం - అరంగుళం ముక్క...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
పొట్టేలు కాళ్లు (ముక్కలుగా) - 4, ఉల్లిపాయ - 1, వెల్లుల్లి - 12 రేకలు, అల్లం - అరంగుళం ముక్క, యాలకులు - 2, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, లవంగాలు - 4, బిర్యాని ఆకులు - 3, నీరు - ఒకటిన్నర లీటర్లు; మసాల కోసం: టమోటాలు - 2 లేదా కప్పు పెరుగు, ఉల్లిపాయ - 1, ధనియాలు - 1 టేబుల్‌ స్పూను, జీలకర్ర - 2 టీ స్పూన్లు, మిరియాలు - ఒక టీ స్పూను, యాలకులు - 2, ఎండు మిర్చి - 3, పసుపు - ఒక టీ స్పూను, అల్లం - అరంగుళం ముక్క, జాజికాయ తురుము - చిటికెడు, ఆవ నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా; అలంకరణకు: అల్లం తరుగు - ఒక టేబుల్‌ స్పూను, నిలువుగా చీరిన పచ్చిమిర్చి - 6, కొత్తిమీర - 4 టేబుల్‌ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
కుక్కర్లో శుభ్రం చేసిన మటన్‌ ముక్కలు, ఉల్లి, వెల్లుల్లి, అల్లం, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యాని ఆకులు వేసి, తగినంత నీరుపోసి అడుగంటకుండా దాదాపు 2 గంటలు ఉడికించాలి. తర్వాత మటన్‌ ముక్కలు వేరుచేసి నీరు వడకట్టి మిగిలిన మిశ్రమాన్ని మెదిపి ఉంచాలి. పాన్‌లో నూనె వేసి ఉల్లితరుగు ఢీప్‌ ఫ్రై చేసి పక్కనుంచాలి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, యాలకులు, పసుపు, అల్లం, ఎండుమిర్చి మిక్సీలో వేసి రెండు టేబుల్‌ స్పూన్లు నీటితో పేస్టు చేసి, అదే పాన్‌లో వేగించాలి. తర్వాత పెరుగు/ టమోటా తరుగు వేసి చిన్నమంటపై మగ్గించాలి. ఇప్పుడు మెదిపిన మిశ్రమం, పక్కనుంచిన మటన్‌ ముక్కలు, జాజికాయ పొడి కలిపి చిక్కబడ్డాక దించేసి కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తరుగుతో అలంకరించాలి.

Updated Date - 2018-11-10T21:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising