ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మలై చికెన్‌

ABN, First Publish Date - 2018-09-12T23:09:25+05:30

బోన్‌లెస్‌ చికెన్‌: అరకేజీ, టమోటా గుజ్జు: అరకప్పు, చిక్కని పెరుగు: అరకప్పు, అల్లంవెల్లుల్లి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
బోన్‌లెస్‌ చికెన్‌: అరకేజీ, టమోటా గుజ్జు: అరకప్పు, చిక్కని పెరుగు: అరకప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్లు, దోరగావేయించిన ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు, పచ్చిమిరపకాయలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), పుదీనా: కొద్దిగా, కొత్తిమీర: కొద్దిగా, కారం: రెండు స్పూన్లు, పసుపు: చిటికెడు, బిర్యానీ పొడి: రెండు స్సూన్లు, కసూరి మెంతి: అర స్పూను, క్రీం: అరకప్పు, నూనె: తగినంత, బిర్యాని ఆకు: కొద్దిగా, యాలకులు: మూడు, గసగసాలు: ఒక స్పూను, దాసించెక్క: చిన్న ముక్క, లవంగాలు: కొన్ని, జాజికాయ: కొద్దిగా, మిరియాలు: కొన్ని, ఉప్పు: తగినంత.
 
తయారీ విధానం
 
ముందుగా చికెన్‌ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసి అందులో దాసించెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జాజికాయ, గసగసాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకన్న చికెన్‌ ముక్కలను వేసి రెండు మూడు నిమిషాల పాట పెద్దమంట మీద వేయించుకోవాలి. ఇవి ఉడుకుతున్న సమయంలో టమోటా గుజ్జు, ఉప్పు, కారం, వేయించిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కసూరి మెంతి, బిర్యానీ మసాలా పెరుగు అన్నీ వేసి సన్నని మంట మీద ఉడకనివ్వాలి. నీరు పోయకుండా చికెన్‌ గట్టిపడేవరకూ ఉడకనివ్వాలి. అనంతరం దీని మీద క్రీం వేసి దించేయాలి.

Updated Date - 2018-09-12T23:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising