ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాహీ నవాబీ బిర్యానీ

ABN, First Publish Date - 2018-06-16T19:16:42+05:30

బాసుమతి- అరకిలో (సగం ఉడికించినవి), బోన్‌లెస్‌ మీట్‌- ఒక కిలో (బాగా కడిగి, ముక్కలుగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
బాసుమతి- అరకిలో (సగం ఉడికించినవి), బోన్‌లెస్‌ మీట్‌- ఒక కిలో (బాగా కడిగి, ముక్కలుగా కట్‌ చేయాలి), పెరుగు-500 గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్టు- నాలుగు నుంచి ఆరు టీస్పూన్లు, పచిమిర్చి-నాలుగు, పెద్ద ఉల్లిపాయలు-10 (ముక్కలుగా), నిమ్మరసం-పావు కప్పు, కారం-అర టీస్పూను, సాజీరా-కొద్దిగా, కొత్తిమీర, పుదీనా తరుగు-ఒక్కొక్కటీ గుప్పెడు, కుంకుమపువ్వు, యాలకులు, దాల్చినచెక్క-కొద్ది కొద్దిగా, శాఫ్రాన్‌ రంగు నీళ్లు- మూడు చుక్కలు, లవంగాలు-రెండు, నూనె- రెండు కప్పులు, నెయ్యి- రెండు టీస్పూన్లు, ఉప్పు-తగినంత.
 
తయారీవిధానం
 
మటన్‌ముక్కల్లో అల్లంవెల్లుల్లి పేస్టును వేసి బాగా కలిపి గంటపాటు నాననివ్వాలి.
ఊతరిగిపెట్టుకున్న ఉల్లిపాయలను తక్కువ మంటపై బ్రౌన్‌ ర ంగులోకి వచ్చేవరకూ వేగించి రెడీగా పెట్టుకోవాలి. ఉల్లిపాయముక్కలు చల్లారిన తర్వాత బాగా మెత్తగా చేయాలి. నానబెట్టిన మటన్‌ ముక్కల్లో వేగించిన ఉల్లిపాయల పేస్టు (మూడొంతుల మేర), పెరుగు, కారం, దాల్చినచెక్క, పచ్చిమిర్చి పేస్టు, యాలకులు, సాజీరా, కొత్తిమీర తరుగు, లవంగాలు, శాఫ్రాన్‌ రంగు నీళ్లు, పుదీనా తరుగు, తగినంత ఉప్పు అన్నీ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. కొద్దిగా నీళ్లల్లో ఒక చెంచా ఉప్పు, దాల్చినచెక్క, లవంగం, యాలకులు, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి మసాలా నీళ్లు ప్రిపేర్‌ చేసుకోవాలి.
పెద్ద పాత్ర తీసుకుని అందులో సగం ఉడకబెట్టిన బాసుమతి బియ్యాన్ని ఒక పొరలా వేయాలి. కుంకుమపువ్వు, నిమ్మరసం, నెయ్యి, మిగిలిన వేగించిన ఉల్లిపాయ పేస్టును ఆ పొరపై వేయాలి. దానిమీద నానబెట్టిన మటన్‌ ముక్కల్ని పరచాలి. మటన్‌ ముక్కలపై మిగిలిన సగం ఉడికిన బియ్యాన్ని పొరలా వేయాలి. ఈ పొరపై మసాలా నీళ్లను చల్లాలి. తర్వాత ఆ గిన్నెపై మూతపెట్టి దాన్ని తవా మీద ఉంచి స్టవ్‌ మీద సన్నని మంటపై ఉడికించాలి. పదిహేను నిమిషాల తర్వాత స్టవ్‌పై నుంచి పాత్రను దించాలి. దానిపై కొత్తిమీర, పుదీనా తరుగును చల్లి నిమ్మకాయ చెక్కలతో అలంకరిస్తే ‘షాహీ నవాబీ బిర్యానీ’ రెడీ.

Updated Date - 2018-06-16T19:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising