ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుకుంబర్‌ లెమనేడ్‌

ABN, First Publish Date - 2018-06-01T15:49:36+05:30

కీర దోసకాయ (పెద్దది) - ఒకటి, నిమ్మరసం - అర కప్పు, లెమన్‌ జెస్ట్‌ (నిమ్మకాయని తురిమితే వస్తుంది)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
కీర దోసకాయ (పెద్దది) - ఒకటి, నిమ్మరసం - అర కప్పు, లెమన్‌ జెస్ట్‌ (నిమ్మకాయని తురిమితే వస్తుంది) - ఒక టీస్పూన్‌ లేదా చిన్న నిమ్మకాయ - ఒకటి, పంచదార - ముప్పావు కప్పు లేదా తేనె రుచికి సరిపడా, మంచి నీళ్లు - ఆరు కప్పులు, ఉప్పు - ముప్పావు టీస్పూన్‌(ఇష్టపడితే), ఐస్‌ క్యూబ్స్‌ - కొన్ని.
 
తయారీ
కీర దోసకాయను శుభ్రంగా కడిగి తొక్క తీయాలి. అలంకరణ కోసం ఒకటి లేదా రెండు స్లయి్‌సలను గుండ్రంగా తరిగి పక్కన పెట్టాలి. మిగతా కీర దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఎక్కువ గింజలు ఉంటే తీసేయాలి. బ్లెండర్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి కీర ముక్కలు, పంచదార వేయాలి. నాలుగు నిమిషాలు బ్లెండ్‌ చేయాలి. తరువాత డ్రింక్‌ను పెద్దగిన్నెలో వడకట్టి నీళ్లను కలపాలి. ఉప్పు, నిమ్మరసం, ఐస్‌ క్యూబ్స్‌, చిన్న నిమ్మకాయ వేసి బాగా కలపాలి. అవసరమైతే మళ్లీ ఒకసారి వడకట్టాలి. సర్వింగ్‌ గ్లాసుల్లో పోసుకుని మరికొన్ని ఐస్‌క్యూబ్స్‌ వేయాలి. గుండ్రంగా తరిగిన కీర దోసకాయ చెక్క లేదా నిమ్మ తొక్కలతో అలంకరించాలి.

Updated Date - 2018-06-01T15:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising