ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిష్‌ హలీమ్‌

ABN, First Publish Date - 2018-05-26T21:27:04+05:30

ముల్లు తీసిన చేపముక్కలు-అరకేజి, గోధుమరవ్వ- ఒక కప్పు (రాత్రి నీళ్లలో నానబెట్టాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
ముల్లు తీసిన చేపముక్కలు-అరకేజి, గోధుమరవ్వ- ఒక కప్పు (రాత్రి నీళ్లలో నానబెట్టాలి), శెనగపప్పు, పెసరపప్పు, ఎర్రకందిపప్పు, మినపప్పు-ఒక్కొక్కటీ ఒక్కో పావు కప్పు(వీటన్నింటినీ విడివిడిగా మూడు గంటలు నీళ్లలో నానబెట్టాలి) అల్లంపేస్టు-ఒక టేబుల్‌స్పూను, వెల్లుల్లిపేస్టు-3/4 టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి-రెండు, తులసి ఆకు-ఒకటి, ఉల్లిపాయ-ఒకటి (సన్నగా తరిగి),పెరుగు-రెండు టేబుల్‌స్పూన్లు, ధనియాలపొడి-అర టేబుల్‌స్పూను, గరంమసాలాపొడి-ఒక టేబుల్‌స్పూను, నల్లమిరియాలపొడి-ఒక టేబుల్‌స్పూను, వేగించిన జీలకర్ర-పావు టేబుల్‌స్పూను, యాలకులు, లవంగాలు-ఒక్కొక్కటీ రెండేసి చొప్పున, దాల్చినచెక్క-చిన్నముక్క, ఉప్పు-రుచికి సరిపడా, నెయ్యి-అర కప్పు, నిమ్మరసం-రెండు టేబుల్‌స్పూన్లు. పైనఅలంకరణకు:నిమ్మ ముక్కలు, కొత్తిమీర- రెండు టేబుల్‌స్పూన్లు, వేగించిన జీడిపప్పులు-ఒక టేబుల్‌స్పూను (ఛాయిస్‌), వేగించిన ఉల్లిపాయముక్కలు-ఒక టేబుల్‌స్పూను, తాజా కొత్తిమీర ఆకులు- అర కప్పు, పుదీనా- పావు కప్పు.
 
తయారీవిధానం
 
అల్లం- వెల్లులి పేస్టు, ఉప్పు, కారం మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించి అరగంటపాటు నాననివ్వాలి. తర్వాత వాటిని నీటిలో ఉడికించాలి. ఉడికిన చేపముక్కలను చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆకులును మిక్సీలో వేసి పేస్టు చేయాలి. నీళ్లలో నానబెట్టిన శెనగపప్పు, పెసరపప్పు, మినపప్పులను కుక్కర్‌లో వేసి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత దీన్ని మెత్తటి పేస్టులా గ్రైండ్‌ చేయాలి.
రాత్రంతా నానబెట్టిన గోధుమరవ్వను ప్రెషర్‌కుక్కర్‌లో మెత్తగా ఉడికించాలి.
ఇందులో పెరుగుతోపాటు దాల్‌ పేస్టు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్టు, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, నల్లమిరియాలపొడి, ధనియాలపొడి, జీలకర్ర పొడి, గరంమసాలా వేసి పేస్టులా చేయాలి. ఈ పేస్టులో చేపముక్కలతోపాటు రెండు కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. వాటిని సన్నని మంటపై ఉంచి మధ్య మధ్యలో కదుపుతూ అరగంటపాటు ఉడకనిచ్చి ఉప్పు చల్లాలి. పెద్ద కడాయిలో నెయ్యి వేసి తులసి ఆకు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు అందులో వేసి వేగించాలి. సువాసన రావడం మొదలవ్వగానే కిందికి దించి వేగించిన ఉల్లిపాయముక్కలను ఫిష్‌ హలీమ్‌పై చల్లాలి. పైన కొత్తిమీర తరుగు గార్నిష్‌లా చేసి, కొద్దిగా నిమ్మరసం చల్లి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2018-05-26T21:27:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising