ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సలి బోటీ

ABN, First Publish Date - 2018-12-29T21:19:13+05:30

మటన్‌ - కిలో (క్యూబ్‌ ఆకారంలో చిన్న ముక్కలుగా కట్‌ చేసి), నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
మటన్‌ - కిలో (క్యూబ్‌ ఆకారంలో చిన్న ముక్కలుగా కట్‌ చేసి), నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్లు, టొమాటోలు - నాలుగు (చిన్నముక్కలుగా చేసి),
ఉల్లిపాయలు - ఐదు (సన్నటి ముక్కలుగా తరిగి), పచ్చిమిర్చి - నాలుగు (చిన్నముక్కలుగా), కొత్తిమీర - సరిపడా, కారం - అర టీస్పూను, పసుపు - అర టీస్పూను, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను, నీళ్లు - రెండు కప్పులు, వెనీగర్‌ - ఒకటిన్నర టేబుల్‌స్పూను, బెల్లం - ఒకటిన్నర టేబుల్‌స్పూను, ఉప్పు - సరిపడా, సలి తయారీకి (ఫెంచిఫ్రై తరహా):బంగాళాదుంపలు - ఏడు, నూనె - వేగించడానికి సరిపడా.
 
తయారీవిధానం
నూనె లేదా నెయ్యిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి. అవి బంగారు రంగులోకి వచ్చేదాకా వేగించాలి. అందులో మసాలా పొడులు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి నిమిషం పాటు వేగించాలి. అందులో మటన్‌ ముక్కలు వేసి అవి లేత బ్రౌన్‌రంగులోకి వచ్చేవరకూ వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై నలభై నిమిషాలు ఉడికించాలి.
తర్వాత అందులో బెల్లం, వెనిగర్‌ వేసి మరో ఆరు నిమిషాలు ఉడికించాలి. తర్వాత దాన్ని పొయ్యి మీద నుంచి దించి కొత్తిమీర చల్లాలి. దీన్ని సలి, చపాతీ లేదా బ్రెడ్‌తో వేడిగా సర్వ్‌ చేయాలి. సలి తయారు చేసేటప్పుడు బంగాళాదుంప ముక్కలను స్ట్రాల్లాగా సన్నగా కట్‌ చేయాలి. వీటిని చల్లటి ఉప్పునీళ్లల్లో కొన్ని నిమిషాలు నాననివ్వాలి.
తర్వాత చల్లటి ఉప్పు నీళ్లను ఒంపేసి అందులోని బంగాళాదుంప ముక్కలను పొడిగా అవనివ్వాలి. వీటిని వేడి నెయ్యి/నూనెలో బంగారు రంగులోకి వచ్చేవరకూ క్రిస్పీగా ఉండేలా వేగించాలి. వేగించిన పొటాటో స్ట్రాస్‌లో ఎక్కువ నూనె ఉంటే పేపర్‌ టిష్యూ మీద కాసేపు ఉంచి తర్వాత తీసేయాలి. వీటితో వేడి వేడిగా సలి బోటిని తింటే వెరైటీగా ఎంతో బాగుంటుంది.

Updated Date - 2018-12-29T21:19:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising