ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొరమీను ఇగురు

ABN, First Publish Date - 2018-07-09T18:08:54+05:30

(శుభ్రపరచిన - తల, తోక లేకుండా) కొరమీను ముక్కలు - డజను, ఉప్పు - సరిపడా, నూనె - 4 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 4, పసుపు - చిటికెడు, కారం - 2, ధనియాల పొడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: (శుభ్రపరచిన - తల, తోక లేకుండా) కొరమీను ముక్కలు - డజను, ఉప్పు - సరిపడా, నూనె - 4 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 4, పసుపు - చిటికెడు, కారం - 2, ధనియాల పొడి - 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను, ఎండుకొబ్బరి పేస్టు - అరకప్పు, గరం మసాల పొడి - ఒక టీ స్పూను, కొత్తిమీర తరుగు - అరకప్పు, నీరు - 3 కప్పులు.
 
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి పాత్రలో చేపలతో పాటు ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల పొడి, ఉల్లి తరుగు, చీలిన పచ్చిమిర్చి వేసి అన్నీ బాగా కలిపి గంట సేపు పక్కనుంచాలి. వెడల్పాటి కడాయిలో నూనె వేసి ఒక్కో కొరమీను ముక్కా సర్దుతూ, ముక్క విరగకుండా రెండువైపులా వేగించాలి. ఇప్పుడు కొబ్బరిపేస్టు, నీరు పోసి మూతపెట్టి కదపకుండా మగ్గించాలి. నీరంతా ఇగిరిపోయి కూర దగ్గరవగానే కొత్తిమీర చల్లి మంట ఆపేయాలి.

Updated Date - 2018-07-09T18:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising