ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెసరపప్పు స్టూ

ABN, First Publish Date - 2018-06-09T23:18:28+05:30

పెసరపప్పు - 1 కప్పు, ఉల్లిపాయ - 1, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 స్పూను, చిలగడ దుంప ముక్కలు - 2 కప్పులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
పెసరపప్పు - 1 కప్పు, ఉల్లిపాయ - 1, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 స్పూను, చిలగడ దుంప ముక్కలు - 2 కప్పులు, కారట్‌ ముక్కలు- 1 కప్పు , తరిగిన పాలకూర లేదా మరేదైనా ఆకుకూర - 2 కప్పులు, పచ్చి బఠాణి - 1 కప్పు, కొబ్బరి పాలు - 2 కప్పులు, నూనె - 2 స్పూనులు, ఉప్పు - తగినంత, కారం - తగినంత, గరం మసాలా - 1 స్పూను, సన్నగా తరిగిన కొత్తిమీర - 2 స్పూనులు, నీళ్లు లేదా వెజిటబుల్‌ స్టాక్‌ - 8 కప్పులు.
 
తయారుచేసే విధానం
నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేగనివ్వండి. తర్వాత వెజిటబుల్‌ స్టాక్‌/నీళ్లు పొయ్యండి. అవి కొద్దిగా కాగిన తరువాత కడిగిన పెసరపప్పు, కూరల ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలిపి మూత పెట్టండి. మధ్యలో కలియబెడుతూ సన్నని సెగపై 45-60 నిమిషాలు ఉడకనివ్వండి. ముక్కలతో పాటు పప్పు ఉడికిన తర్వాత కొబ్బరి పాలు పోసి 5 నిమిషాల తరువాత దించేయండి. వడ్డించేముందు స్టూపై కొత్తిమీర తరుగు చల్లండి. రాత్రి భోజనం బదులుగా స్టూ తీసుకుంటే తేలికగా ఉంటుంది.

Updated Date - 2018-06-09T23:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising