ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రొయ్యలతో బేక్డ్‌ పొటాటోస్‌

ABN, First Publish Date - 2018-06-09T21:37:21+05:30

బంగాళాదుంపలు-మూడు కేజీలు, నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ-ఒకటి (సన్నగా తరిగి), పుట్టగొడుగులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
బంగాళాదుంపలు-మూడు కేజీలు, నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ-ఒకటి (సన్నగా తరిగి), పుట్టగొడుగులు-ఒకటిన్నర కప్పులు (సన్నగా తరిగి), చిన్నరొయ్యలు- 750 గ్రాములు (పొట్టుతీసి), పాలు- అరకప్పు, చికెన్‌ స్టాక్‌ క్యూబ్స్‌-రెండు, నల్లమిరియాలు-అర టీస్పూను (మెత్తగా చేసి), కార్న్‌ఫ్లోర్‌- ఒకటిన్నర టేబుల్‌స్పూను (కొన్ని నీళ్లు కలిపి పలచగా చేయాలి.)
 
తయారీవిధానం
 
ప్రీహీటెడ్‌ ఒవెన్‌లో అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టిన బంగాళాదుంపల్ని ఉంచాలి. 220 డిగ్రీల దగ్గర ముప్పావుగంట బేక్‌ కానివ్వాలి. పాన్‌లో నూనె వేడిచేసి ఉల్లి తరుగును వేగించాలి. పుట్టగొడుగు ముక్కలు వేసి మరి కాసేపు ఉడికించాలి.
తరువాత రొయ్యలు, చికెన్‌ స్టాక్‌ క్యూబ్స్‌, మిరియాలపొడి వేసి కలిపి మరి కాసేపు ఉడికించాలి. అందులో కార్న్‌ఫ్లోర్‌ నీళ్లు పోసి ఉండకట్టకుండా కలపాలి. రసం చిక్కనయ్యేంతవరకూ మిశ్రమాన్ని ఉడికించాలి. తర్వాత స్టవ్‌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టిన బంగాళాదుంపలను బయటకు తీసి వాటిని సగానికి కోసి వాటి మధ్యన చిన్న రంధ్రం పెట్టాలి. ఆ రంధ్రంలో రొయ్యల సాస్‌ వేసుకుని తింటే టేస్టీగా ఉంటాయి.

Updated Date - 2018-06-09T21:37:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising