ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గులాబీ షర్బత్‌

ABN, First Publish Date - 2018-03-15T21:49:55+05:30

గులాబీ పూల రెమ్మలు - రెండు కప్పులు (శుభ్రంగా కడిగి పేపర్‌ టవల్‌ మీద ఆరబెట్టాలి), పంచదార...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
గులాబీ పూల రెమ్మలు - రెండు కప్పులు (శుభ్రంగా కడిగి పేపర్‌ టవల్‌ మీద ఆరబెట్టాలి), పంచదార - ఒక కప్పు, యాలక్కాయ పొడి - అర టీస్పూన్‌, నిమ్మకాయలు - రెండు (రసం తీసి, వడకట్టాలి), దానిమ్మ గింజల రసం - ఒక కప్పు (ఇష్టపడితే)
 
తయారీవిధానం
 
గులాబీ పూల రెమ్మలను మెత్తగా గ్రైండ్‌ చేసి లోతైన గాజు గిన్నెలో వేయాలి. అందులో ఒక కప్పు వేడి నీళ్లు పోసి, యాలకల పొడి కలపాలి. గిన్నె మీద మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచాలి.
మరుసటి రోజు ఉదయం సన్నటి జాలీలో గులాబీల మిశ్రమాన్ని వడకట్టాలి.
వడకట్టిన రసంలో పంచదార వేసి కరిగేవరకు కలపాలి. వేడిచేయొద్దు.
పంచదార కరిగాక నిమ్మ, దానిమ్మ గింజల రసాలను వేసి బాగా కలపాలి. రెడీ అయిన సిర్‌పను ఫ్రిజ్‌లో ఉంచితే మూడు నుంచి నాలుగు రోజులు వరకు తాజాగా ఉంటుంది.
ఒక పొడవైన గ్లాసులో కొంచెం సిరప్‌ వేసుకుని చల్లటి నీళ్లు లేదా క్రష్డ్‌ ఐస్‌ వేసుకుని తాగితే టేస్టీగా ఉంటుంది. ఈ షర్బత్‌ వేడికి చెక్‌ పెడుతుంది కూడా!

Updated Date - 2018-03-15T21:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising