ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీరకాయ మజ్జిగ కర్రీ

ABN, First Publish Date - 2018-05-05T22:21:25+05:30

బీరకాయలు- 300 గ్రాములు (పొట్టు తీసి ముక్కలుగా తరగాలి), శెనగపిండి- ఒక టేబుల్‌స్పూను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
బీరకాయలు- 300 గ్రాములు (పొట్టు తీసి ముక్కలుగా తరగాలి), శెనగపిండి- ఒక టేబుల్‌స్పూను, చక్కెర, పసుపు- అర టీస్పూను, పచ్చిమిర్చి- రెండు (నిలువుగా చీల్చి),పెరుగు- అర కప్పు (ఒక్కసారి మిక్సీలో తిప్పాలి), టొమాటోలు- రెండు(ప్యూరీలా చేసి), సబ్జగింజలు- ఒక టీస్పూను, వంటనూనె- అర టీస్పూను, ఉప్పు- తగినంత.
తాలింపు కోసం: నెయ్యి-ఒక టీస్పూను, జీలకర్ర- అర టీస్పూను, ఎండుమిర్చి- ఒకటి (ముక్కలుగా), దాల్చినచెక్క- చిన్నది.
 
తయారీవిధానం
 
పెరుగు, శెనగపిండి, ఉప్పు మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఆ పేస్టులో కప్పు నీళ్లు పోసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. పాన్‌లో నూనె పోసి వేడెక్కిన తర్వాత అందులో సబ్జ గింజలు వేయాలి.అవి చిటపటలాడేటప్పుడు టొమాటో ప్యూరీ, పచ్చిమిర్చి, పసుపు వేయాలి. టొమాటో ప్యూరీ బాగా ఉడికే వరకూ కలపాలి. బీరకాయముక్కలు, చిక్కని మజ్జిగ, చక్కెరలో ఈ టొమాటో మిశ్రమాన్ని కలిపి ఉడికించాలి. అది ఉడికినంత సేపూ కలియబెడుతుండాలి. కూర ఉడకడం ప్రారంభమైన తర్వాత మంటను చిన్నగా చేసి మరో నాలుగు నిమిషాలు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల మసాలా వాసనలు కూరలోకి ఇంకడమేగాక బీరకాయ కూడా మెత్తబడుతుంది. కూరని రుచి చూసి అవసరమనిపిస్తే కొద్దిగా ఉప్పు కలపొచ్చు. కూరను వేరే పాత్రలోకి మార్చాలి.
చిన్న పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక దాల్చినచెక్క, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు వేసి వేగించి ఆ తాలింపును కూరపై పోయాలి. బీరకాయ, మజ్జిగ కూరను వేడివేడిగా పుల్కాతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-05-05T22:21:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising