ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టొమాటో-సగ్గుబియ్యం వడియాలు

ABN, First Publish Date - 2018-05-12T21:33:22+05:30

టొమాటోలు-200 గ్రాములు, సగ్గుబియ్యం-పావు కేజీ, కారం-రెండు టీస్పూన్లు, ఉప్పు-తగినంత, నీళ్లు-ఐదు కప్పులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
టొమాటోలు-200 గ్రాములు, సగ్గుబియ్యం-పావు కేజీ, కారం-రెండు టీస్పూన్లు, ఉప్పు-తగినంత, నీళ్లు-ఐదు కప్పులు.
 
తయారీవిధానం
 
సగ్గుబియ్యాన్ని బాగా కడిగి నీళ్లలో పదిహేను నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీళ్లు వంపేసి సగ్గుబియ్యాన్ని ప్రెషర్‌ కుక్కర్‌లో వేయాలి. అందులో ఐదు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చే దాకా ఉడికించాలి. చల్చార్చాలి. నీళ్లను మరిగించి అందులో టొమాటోలు వేసి పదిహేను నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల టొమాటోపై ఉన్న తొక్కను సులువుగా తీయొచ్చు. టొమాటోలను ముక్కలుగా తరిగి బ్లెండర్‌లో వేసి మెత్తగా చేయాలి. ఉడికిన సగ్గుబియ్యంలో ఈ టొమాటో గుజ్జును వేసి కలపాలి.
ఈ మిశ్రమంలో ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్‌ షీటుపై చిన్న చిన్న పాపడ్‌ తరహాలో వేసి రెండు రోజులు ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేయాలి. వడియాలను వేగించి తింటే రుచిగా ఉంటాయి. వీటిని రసంతో లేదా పెరుగన్నంలో తింటే యమ్మీగా ఉంటాయి.

Updated Date - 2018-05-12T21:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising