ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొంబాయిరవ్వ వడియాలు

ABN, First Publish Date - 2018-05-12T21:31:26+05:30

బొంబాయిరవ్వ-ఒక కప్పు, నీళ్లు-ఏడు కప్పులు, పచ్చిమిర్చి పేస్టు-రెండు టీస్పూన్లు, జీలకర్ర-ఒక టీస్పూను, ఉప్పు-తగినంత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
బొంబాయిరవ్వ-ఒక కప్పు, నీళ్లు-ఏడు కప్పులు, పచ్చిమిర్చి పేస్టు-రెండు టీస్పూన్లు, జీలకర్ర-ఒక టీస్పూను, ఉప్పు-తగినంత.
 
తయారీవిధానం
 
పెద్ద గిన్నె తీసుకుని అందులో నీళ్లు పోసి మరిగించాలి. దాంట్లో ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్టు వేసి బాగా కలపాలి. రవ్వను కూడా మరుగుతున్న నీళ్లలో పోయాలి.
బొంబాయిరవ్వను మరిగిన నీళ్లలో పోసేటప్పుడు గరిటెతో మెల్లగా తిప్పుతుండాలి. గిన్నెపై మూతపెట్టి పూర్తిగా ఉడకనివ్వాలి. రవ్వ మెత్తగా అవ్వాలి. పిండి చల్లారిన తర్వాత చెంచాతో పాపడ్‌లాగ ప్లాస్టిక్‌ షీటుపై పెట్టాలి. అలా పిండి అంతా పెట్టి వాటిని బాగా ఎండనివ్వాలి. ఎండిన వడియాలను గాలి చొరబడని డబ్బాలో భద్రపరచాలి. వేగించుకుని పప్పుచారు, పప్పులతోనే కాకుండా సాయంత్రాలు టీతో పాటు స్నాక్స్‌గా తిన్నా బాగుంటాయి ఇవి.

Updated Date - 2018-05-12T21:31:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising