ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హిమ’క్రీమ్స్‌ మ్యాంగో ఐస్‌క్రీమ్‌

ABN, First Publish Date - 2017-05-20T20:38:36+05:30

కావలసిన పదార్థాలు అల్ఫాన్సో మామిడి పండ్లు - మూడు, కండెన్స్‌ ్డమిల్క్‌ - 400 గ్రాములు, 25 నుంచి 50 శాతం కొవ్వు కలిగిన మీగడ (చిల్డ్‌) - మూడున్నర కప్పులు, వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌ - అర టీస్పూన్‌(ఇష్టపడితే).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
అల్ఫాన్సో మామిడి పండ్లు - మూడు, కండెన్స్‌ ్డమిల్క్‌ - 400 గ్రాములు, 25 నుంచి 50 శాతం కొవ్వు కలిగిన మీగడ (చిల్డ్‌) - మూడున్నర కప్పులు, వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌ - అర టీస్పూన్‌(ఇష్టపడితే).
 
తయారీ విధానం
మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడవాలి. తరువాత ముక్కలు తరగాలి.
ఈ ముక్కల్ని బ్లెండర్‌ జార్‌లో వేసి, కండెన్స్‌ ్డమిల్క్‌ పోసి మెత్తటి గుజ్జులా గ్రైండ్‌ చేయాలి.
పెద్ద గిన్నెలో మీగడ వేసి బాగా గిలక్కొట్టాలి. అయితే మరీ ఎక్కువగా గిలక్కొడితే విరిగిపోయినట్టు అవుతుంది. అలాకాకుండా జాగ్రత్తపడాలి.
తరువాత ఇందులో గ్రైండ్‌ చేసిన మామిడి గుజ్జు కలపాలి. అర టీస్పూన్‌ వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి మళ్లీ ఒకసారి కలపాలి. గిన్నెలోని మిశ్రమం పై భాగాన స్పూన్‌తో సమంగా పరవాలి.
గిన్నెను అల్యూమినియం ఫాయిల్‌తో గాలిచొరబడకుండా మూసేయాలి.
దీన్ని ఆరు నుంచి ఏడుగంటలు లేదా ఒక రాత్రంతా ఫ్రీజర్‌లో ఉంచాలి. ఐస్‌క్రీం మృదువుగా రావాలంటే ఫ్రీజర్‌లో ఉంచిన ఐస్‌క్రీం సగం గట్టిపడ్డాక మళ్లీ ఒకసారి గిలక్కొట్టాలి.
ఐస్‌క్రీం తినాలనిపించినప్పుడు గిన్నెను ఫ్రీజర్‌ నుంచి బయటకు తీయాలి. గది ఉష్ణోగ్రతలో కొంచెంసేపు ఉంచాక స్కూప్‌తో తీస్తే ఐస్‌క్రీం సులభంగా వచ్చేస్తుంది.
ఐస్‌క్రీంను బౌల్‌లో ఉంచి చెర్రీ, టూటీఫ్రూటీ, మామిడి పండు ముక్కలు లేదా చాకొలెట్‌ సాస్‌లతో అలంకరించి తింటే యమ్మీ యమ్మీగా ఉంటుంది.

Updated Date - 2017-05-20T20:38:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising