ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మసాలా మజ్జిగ

ABN, First Publish Date - 2017-04-15T19:40:48+05:30

పెరుగు- 400 ఎంఎల్‌, బ్లాక్‌ సాల్ట్‌- 1 టీస్పూను, చాట్‌ మసాలా- 1 టీస్పూను, ఇంగువ- చిటికెడు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: పెరుగు- 400 ఎంఎల్‌, బ్లాక్‌ సాల్ట్‌- 1 టీస్పూను, చాట్‌ మసాలా- 1 టీస్పూను, ఇంగువ- చిటికెడు, పచ్చిమిరపకాయలు- 2 (సన్నగా తరిగినవి), అల్లం - చిన్న ముక్క, ఉప్పు - తగినంత, నిమ్మరసం- 1 టీస్పూను, కరివేపాకులు- కొన్ని. సన్నగా తరిగిన కొత్తిమీర- 2 టేబుల్‌స్పూన్లు.
 
తయారీ: తరిగిపెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం, కొన్ని కరివేపాకులను మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమంలో పెరుగు వేసి గిలక్కొట్టాలి. తర్వాత మజ్జిగను గ్లాసులో పోసి చాట్‌ మసాలా, బ్లాక్‌ సాల్ట్‌, నిమ్మరసం, ఇంగువ వేసి కలిపి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత దానిపై కరివేపాకు, కొత్తిమీర తరుగు చల్లి తాగితే ఎంతో రుచిగా ఉంటుంది.
 
ఉపయోగాలు:
 
ఆరోగ్యానికి...
మజ్జిగ శరీరంలో వేడిని తగ్గించి చలవదనాన్ని పంచుతుంది.
రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది.
మజ్జిగలో కాలరీలు తక్కువ ఉంటాయి.
ఎసిడిటీని తగ్గిస్తుంది.
జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.
శరీరంలో క్యాల్షియం పరిమాణం పెరుగుతుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
రక్తపోటును తగ్గించడమే కాకుండా క్యాన్సర్‌ను నియంత్రిస్తుంది.
డీహైడ్రేషన్‌ తలెత్తకుండా కాపాడుతుంది.
గుండెపోటు బారిన పడకుండా రక్షిస్తుంది.
 
అందానికి...
మజ్జిగను జుట్టుకు మాస్క్‌లా వేసుకుంటే కండిషనర్‌గా పనిచేస్తుంది.
బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.
సన్‌ ట్యాన్‌ లాంటి వాటిని పోగొట్టడమే కాదు మేనికి మెరుపునిస్తుంది మజ్జిగ.
చర్మంపై మృతకణాలు పోవడానికి ఫేషియల్‌ మాస్కులా పనిచేస్తుంది.
స్కిన్‌టోన్‌ మెరుగు పరుస్తుంది.
చర్మంపై ఏర్పడ్డ మచ్చలను పోగొడుతుంది.
శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
చుండ్రును పోగొడుతుంది.
 
మామిడి పండు లస్సీ:  
 
తులసి మజ్జిగ 
 
బబ్లీ బటర్ మిల్క్ 
 
పుదీనా మజ్జిగ 
 
 
 
 
 
 
 
 
 

Updated Date - 2017-04-15T19:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising