ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాఫీ మిల్క్‌షేక్‌

ABN, First Publish Date - 2017-04-01T20:28:15+05:30

కావాల్సిన పదార్థాలు ఇన్‌స్టంట్‌ కాఫీ పొడి - ఒక టేబుల్‌ స్పూన్‌, గోరువెచ్చని నీళ్లు - పావు కప్పు, పంచదార -

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమ్మర్‌ సూర్యుడు సంపేస్తున్నాడ్రా బాబోయ్‌ అని కాస్త నీడని, మరికాస్త చల్లదనాన్ని కోరుకోవడం సహజం ఈ సీజన్‌లో. మరి అలాంటిది...గంటలు గంటలు వంట గదిలో చెమటలు కక్కుతూ, వేడిని ఓరుస్తూ వండిపెట్టేవాళ్ల పరిస్థితి ఏమిటంటారు? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈ సీజన్‌లో తక్కువ టైంలో చకచకా పూర్తయ్యే వంటలకే ఓటెయ్యాలి. అవి కూడా కడుపుని, శరీరాన్ని చల్లగా ఉంచాలి. అలాంటిదే ఈ కాఫీ మిల్క్ షేక్.. 
 
కావాల్సిన పదార్థాలు
 
ఇన్‌స్టంట్‌ కాఫీ పొడి - ఒక టేబుల్‌ స్పూన్‌, గోరువెచ్చని నీళ్లు - పావు కప్పు, పంచదార - నాలుగు టేబుల్‌ స్పూన్లు లేదా మీరు ఇష్టపడేంత తీపి, వెన్నతీయని పాలు (చల్లటివి) - రెండు కప్పులు, ఐస్‌క్యూబ్స్‌ - ఎనిమిది.
 
 
 
తయారీ విధానం
 
బ్లెండర్‌లో ఇన్‌స్టంట్‌ కాఫీ పొడి, పంచదార, గోరువెచ్చని నీళ్లు పోసి కలపాలి.
మిల్క్‌షేక్‌ కోసం ఫుల్‌క్రీమ్‌ పాలు వాడారు ఇక్కడ. వెన్న తీసిన పాలు, తక్కువ కొవ్వు ఉన్న పాలు కూడా వాడొచ్చు. ఒకవేళ ఇవి వాడుతుంటే పావుకప్పు నీళ్లకు బదులు రెండు లేదా మూడు టేబుల్‌ స్పూన్ల నీళ్లు పోస్తే చాలు.
అన్నింటినీ వేశాక ఒక నిమిషం బ్లెండ్‌ చేయాలి. కాఫీ నురగ వచ్చే వరకు లేదా మిశ్రమం లేతరంగుకు వచ్చేవరకు బ్లెండ్‌ చేయాలి.
ఐస్‌క్యూబ్స్‌ వేయాలి. షేక్‌ చిక్కగా ఉండాలనుకుంటే ఐస్‌క్యూబ్స్‌ సంఖ్య తగ్గించాలి.
తరువాత చల్లటి పాలను పోసి బాగా కలిపి మళ్లీ ఒకసారి బ్లెండ్‌ చేయాలి. పైన నురగ వస్తుంది.
తయారైన కాఫీ మిల్క్‌షేక్‌ని గ్లాసుల్లో పోసుకుని వెంటనే తాగేయాలి. లేదంటే నురగ తగ్గిపోతుంది.

Updated Date - 2017-04-01T20:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising