ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నువ్వులతో మటన్‌ కర్రీ

ABN, First Publish Date - 2017-12-02T16:53:55+05:30

మటన్‌(చిన్న ముక్కలు)-కిలో, అల్లం పేస్టు- ఒక టేబుల్‌స్పూను, వెల్లుల్లి పేస్టు- ఒకటిన్నర టేబుల్‌స్పూను, ఉప్పు-ఒక టీస్పూను, బెల్లం (తరుగు), గసగసాలు- ఒక్కో టేబుల్‌స్పూను చొప్పున, లవంగాలు-8, గ్రీన్‌ యాలకులు-ఆరు, సోంపు-రెండు టీస్పూన్లు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సినవి: మటన్‌(చిన్న ముక్కలు)-కిలో, అల్లం పేస్టు- ఒక టేబుల్‌స్పూను, వెల్లుల్లి పేస్టు- ఒకటిన్నర టేబుల్‌స్పూను, ఉప్పు-ఒక టీస్పూను, బెల్లం (తరుగు), గసగసాలు- ఒక్కో టేబుల్‌స్పూను చొప్పున, లవంగాలు-8, గ్రీన్‌ యాలకులు-ఆరు, సోంపు-రెండు టీస్పూన్లు, దాల్చినచెక్క- చిన్నముక్క, నూనె- నాలుగు టేబుల్‌స్పూన్లు, ఆవాలు-ఒక టీస్పూను, ఎండుమిర్చి-ఐదు, కారం-ఒక టీస్పూను, పసుపు- అరచెంచా, సన్నగా తరిగిన అల్లం ముక్కలు- మూడు టేబుల్‌స్పూన్లు, నువ్వులు(వేగించి)-ఒక టీస్పూను, నిమ్మరసం, కొత్తిమీర తరుగు- ఒక్కోటి రెండు టీస్పూన్ల చొప్పున.
 
తయారీ:
  • అల్లం, వెల్లుల్లి పేస్టు, బెల్లం తరుగు, ఉప్పులను ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మటన్‌కు పట్టించి గంటపాటు నానబెట్టాలి.
  • గసగసాలు, వెల్లుల్లి, యాలకులు, సోంపు, దాల్చినచెక్కలను తవా మీద కాసేపు వేగించి గ్రైండ్‌ చేయాలి.
  • లోతైన కళాయిలో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి వేగించాలి. తరువాత మటన్‌ వేసి బంగారు రంగులోకి వచ్చే వరకూ వేగించాలి.
  • మటన్‌ వేగాక కారం, పసుపు, అల్లం, గ్రైండ్‌ చేసిపెట్టుకున్న మసాలా వేసి కలపాలి.
  • తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి గంటసేపు సన్నని మంటపై ఉడికించాలి.
  • వేగించిన నువ్వులను మటన్‌ కర్రీపై చల్లి నిమ్మరసం కూడా వేసి కలపాలి.
  • రెడీ అయిన మటన్‌ కర్రీ మీద కొత్తిమీర తరుగు చల్లి వేడి వేడిగా తింటే టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2017-12-02T16:53:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising