ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్‌ రోస్ట్‌

ABN, First Publish Date - 2017-01-31T19:43:47+05:30

నూనె - 2 టీస్పూన్లు బిర్యాని ఆకు - 1 యాలకులు - 3

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
నూనె - 2 టీస్పూన్లు
బిర్యాని ఆకు - 1
యాలకులు - 3
లవంగాలు - 3
దాల్చిన చెక్క - చిన్న ముక్క
చికెన్‌ - పావు కిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - ఒకటిన్నర టీస్పూను
ఉల్లిముక్కలు - అర కప్పు
కారం - పావు టీస్పూను
గరం మాసాలా - అర టీస్పూను
కరివేపాకు - కొద్దిగా
పసుపు - చిటికెడు
 
తయారీ విధానం
బాండీలో నూనె పోసి బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి.
తర్వాత మంట తగ్గించి చికెన్‌ ముక్కలు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు కూడా వేసి కలపాలి.
చిన్న మంట మీద ఉంచి నీరు వదిలేదాకా 3, 4 ని.లపాటు వేయించాలి.
తర్వాత ఉల్లి ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి కలపాలి.
5 ని.ల తర్వాత కారం, గరం మసాలా వేసి కలిపి మూత ఉంచి ముక్కలు మెత్తబడేవరకూ చిన్న మంట మీద ఉంచి ఉడికించాలి.
తర్వాత ఒక టీస్పూను నూనె పోసి ఇంకో నిమిషంపాటు వేయించి, మూత ఉంచి మంట తీసేయాలి.
15 ని.లపాటు కదలకుండా ఉంచి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

Updated Date - 2017-01-31T19:43:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising