ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునగాకు సాంబార్‌

ABN, First Publish Date - 2017-03-04T15:32:04+05:30

సరస్వతి ఆకుతో వార్ధక్యం మీదపడదనీ, మెదడు పదునెక్కుతుందని తెలిసిన వాళ్లు ఎందరు? టప్‌ టప్‌ మంటూ సౌండ్‌ వస్తుందని చిన్నప్పుడు నుదుటికి కొట్టుకుని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్‌ డూపర్‌ మునగాకు 
మునగాకుల్లో కమలా పండ్లలో కంటే విటమిన్‌-సి ఏడు రెట్లు, క్యారెట్లలో కంటే విటమిన్‌-ఎ నాలుగు రెట్లు, పాలలో కంటే క్యాల్షియం నాలుగు రెట్లు, అరటిపండ్లలో కంటే పొటాషియం మూడు రెట్లు, పెరుగులో కంటే ప్రొటీన్‌ రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో రక్తహీనతకు మునగాకు మంచి మందు. మన దగ్గర మునగాకుల్ని అంతగా పట్టించుకోరు. కాని ఆఫ్రికాలో పోషకాహారలోపంతో బాధపడే పిల్లలకు ఈ ఆకుల పొడిని ఇస్తుంటారు. ఈ పొడి తీసుకున్న పిల్లలు బరువు పెరుగుతారు. మొత్తంగా ఆరోగ్యం బాగుంటుంది. గర్భిణులు దీన్ని సేవించడం వల్ల పిల్లలు మంచి బరువుతో పుడతారు. రక్తహీనత బారినపడకుండా ఉంటారు. ఈ మధ్య మన దగ్గర కూడా ఈ ఆకులతో తయారుచేసిన కుకీలు, హెర్బల్‌ టీ ప్రాచుర్యం పొందుతున్నాయి. మనగాకుల్ని మెంతి, పాలకూరలకు బదులుగా వాడతారు. అంతేకాదు యువతరం ఎంతో ఇష్టంగా తినే పిజ్జా, ఆమ్లెట్లలో మునగాకుల్ని వాడుతున్నారు.
 
 
మునగాకు సాంబార్‌
 
కావలసిన పదార్థాలు
మునగాకులు - గుప్పెడు, చింతపండు - నిమ్మకాయంత సైజ్‌, కందిపప్పు (ఉడికించి) - ఒక కప్పు, ఇంగువ - చిటికెడు, సాంబార్‌ పొడి - ఒక టీ స్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, బియ్యప్పిండి - ఒక టేబుల్‌ స్పూన్‌, నూనె - ఒక టీ స్పూన్‌, ఆవాలు - తాలింపునకు, ఉప్పు - రుచికి సరిపడా, కరివేపాకులు - కొన్ని.
 
తయారీవిధానం:
చింతపండు రసం పిండి పసుపు, ఇంగువ, సాంబార్‌ పొడి, ఉప్పు వేసి చింతపండు పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలి. తరువాత మునగాకులు వేసి మరికొద్దిసేపు ఉడికించాలి. ఉడికించిన కందిపప్పును మెత్తగాచేసి రసం నీళ్లలో కలపాలి. తరువాత బియ్యప్పిండి కలిపితే రసం చిక్కబడుతుంది. ఈ మిశ్రమం ఉడుకుపట్టాక, స్టవ్‌ మంట ఆపేయాలి. నూనె వేడిచేసి, ఆవాలు వేసి అవి చిటపటమంటున్నప్పుడు కరివేపాకులు వేసి, సాంబార్‌లో తాలింపు వేయాలి. ఈ సాంబార్‌ను అన్నంలో కలుపుకుని తింటే యమ్మీగా ఉంటుంది

Updated Date - 2017-03-04T15:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising