ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పచ్చిమిర్చి చట్నీ

ABN, First Publish Date - 2017-03-29T16:28:24+05:30

కావలసినవి పదార్థాలు పచ్చిమిర్చి - పావుకిలో, వెల్లుల్లి రెబ్బలు - పది, జీలకర్ర - కొద్దిగా, పసుపు - చిటికెడు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి పదార్థాలు
 
పచ్చిమిర్చి - పావుకిలో, వెల్లుల్లి రెబ్బలు - పది, జీలకర్ర - కొద్దిగా, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, వెనిగర్‌ - ఒక టీస్పూన్‌, నూనె - తగినంత.
అవసరం అనుకుంటే తాజా కొబ్బరి తురుము లేదా వేగించిన పల్లీలు వాడొచ్చు.
 
 
 
తయారీ విధానం
 
పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తడి ఆరేవరకు ఆరబెట్టాలి. తరువాత వాటిని కత్తితో నిలువుగా చీల్చాలి.
పాన్‌లో నూనె వేడిచేశాక చీల్చిన పచ్చిమిర్చి వేసి అవి రంగు మారేవరకు వేగించాలి.
తరువాత వెల్లుల్లి, జీలకర్ర, పసుపు వేసి కాసేపు వేగించాలి.
ఈ మిశ్రమం బాగా చల్లారాక ఉప్పు, వెనిగర్‌లతో పాటు పాన్‌లో మిగిలిన నూనెను కూడా పోసి మెత్తగా నూరాలి.
గాలి చొరబడని సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచితే నెలరోజుల వరకు పాడుకాదు.
పచ్చిమిర్చి చట్నీని సైడ్‌ డిష్‌గా ఇడ్లీ, దోసెల్లోకి వాడుతుంటే కనుక ఇలా చేయండి. ఒక టేబుల్‌ స్పూన్‌ వేగించిన నువ్వులు, శెనగపప్పు, మినపప్పులు ఒక్కోటి మూడు టేబుల్‌ స్పూన్లు చొప్పున తీసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. మొదట నువ్వులు, మిగతా పప్పులు గ్రైండ్‌ చేయాలి. తరువాత వేగించిన పచ్చిమిర్చి, మిగతా పదార్థాలు వేయాలి. అవసరమనుకుంటే కాచి, చల్లార్చిన నీళ్లు కొన్ని కలపొచ్చు. ఇందులో గుప్పెడు పుదీనా లేదా కొత్తిమీర తరుగు కూడా కలిపితే యమ్మీ యమ్మీ గ్రీన్‌చిల్లీ చట్నీ రెడీ..
అలా వద్దనుకుంటే కొబ్బరి లేదా పల్లీ గింజలు కలిపి కూడా నూరుకోవచ్చు.

Updated Date - 2017-03-29T16:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising