ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మసాలా కీరా

ABN, First Publish Date - 2017-02-25T17:02:20+05:30

పుష్కలంగా నీరుండే కీరా దోసకాయ వేసవిలో మీకు మంచి నేస్తం. డీహైడ్రేట్‌ అయిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుష్కలంగా నీరుండే కీరా దోసకాయ వేసవిలో మీకు మంచి నేస్తం. డీహైడ్రేట్‌ అయిన శరీరానికి సత్వరమే నీటిని అందిస్తుంది. వంట్లోని వ్యర్థాలను బయటికి పంపేస్తుంది.
 
కావలసినవి
కీరదోసకాయలు - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, కరివేపాకులు - కొన్ని, చింతపండు - కొద్దిగా, టొమాటో - (తరిగి) చిన్న ముక్క, కొబ్బరి తురుము - అర టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర తరుగు - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, ఇంగువ - కొద్దిగా, ఆవాలు, జీలకర్ర - ఒక్కోటి పావు టీస్పూన్‌ చొప్పున, గోధుమపిండి - పావు టీస్పూన్‌, నూనె - ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు - సరిపడా.
 
 
తయారీవిధానం
డ్రై మసాలా పొడిని అర కప్పు నీళ్లలో కలిపి పక్కన పెట్టాలి.
కీరాని మరీ సన్నగా, లావుగా కాకుండా ఓ మాదిరి సైజులో తరగాలి.
మందపాటి పాన్‌లో నూనె వేడిచేసి తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకులు, పచ్చిమిర్చి వేసి చిటపటమనేవరకు వేగించాలి.
తరువాత మసాలా పేస్ట్‌, చింతపండు వేసి ఒక నిమిషం పాటు వేగించాలి.
టొమాటో, కీరదోసకాయల తరుగు, కొబ్బరి తురుము వేసి మూతపెట్టి సన్నటి మంట మీద ఉంచాలి.
కీర దోసకాయ ముక్కలు ఉడకాలి కాని పట్టుకుంటే గట్టిగా ఉండాలి. అవి అలా ఉన్నప్పుడు ఉప్పు వేయాలి. గోధుమపిండి చల్లి కలపాలి.
గోధుమపిండి వేశాక కొంచెంసేపు ఉడికించి వడ్డించే గిన్నెలోకి వంపేయాలి.
కొత్తిమీర తరుగుతో అలంకరించి వేడివేడి పుల్కాలతో లేదా పూరీ, అన్నం దేనితో తిన్నా టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2017-02-25T17:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising