ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతాఫలం కలాఖండ్‌

ABN, First Publish Date - 2017-10-14T17:24:51+05:30

పాలు- రెండు లీటర్లు, నిమ్మరసం, చక్కెర ఒక్కొక్కటి రెండు టీస్పూన్లు, ఏలకులు- అరకప్పు (పొడి చేయాలి), సీతాఫలంగుజ్జు- ఒక టీస్పూను, నెయ్యి- ఒక కప్పు, పిస్తాలు-అరకప్పు, బాదంపప్పులు-ఆరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాలసినవి: పాలు- రెండు లీటర్లు, నిమ్మరసం, చక్కెర ఒక్కొక్కటి రెండు టీస్పూన్లు, ఏలకులు- అరకప్పు (పొడి చేయాలి), సీతాఫలంగుజ్జు- ఒక టీస్పూను, నెయ్యి- ఒక కప్పు, పిస్తాలు-అరకప్పు, బాదంపప్పులు-ఆరు.
 
తయారీ: రెండు ప్యాన్లు తీసుకుని ఒక్కొక్కదానిలో ఒక్కొక్క లీటరు పాలు పోయాలి. ఒక ప్యానులోని పాలు సగానికి వచ్చే దాకా బాగా మరగనివ్వాలి. ఇంకో ప్యాన్లో ఉన్న పాలను కూడా వేడిచేయాలి. ఈ పాలు మరిగేటప్పుడు మంటను తగ్గించి అందులో నిమ్మరసం పోసి దగ్గరకు పేరుకునే వరకూ స్టవ్‌ మీద ఉంచాలి. స్టవ్‌ ఆపేసి మెత్తటి నూలు గుడ్డ తీసుకుని పేరుకుపోయిన పాలను అందులో వడగొట్టాలి. ఆ పనీరులో నీరు అస్సలు ఉండకూడదు. మరో ప్యానులో ఉన్న సగానికి మరిగించిన పాలలో ఈ పనీరును కలిపి దగ్గరపడేదాకా ఉడికించాలి. ఇందులో చక్కెర కలిపి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఏలకుల పొడి, సీతాఫలం గుజ్జు వేసి బాగా కలపాలి. ఒక ప్లేటు తీసుకుని దానిపై నెయ్యి రాసి అందులో ఆ మిశ్రమాన్ని పోసి ప్లేటు మొత్తం పరచాలి. దానిపై పిస్తా ముక్కలు చల్లాలి. అది చల్లారిన తర్వాత ముక్కలుగా కోయాలి. కలాఖండ్‌ రెడీ

Updated Date - 2017-10-14T17:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising