ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొట్లకాయ పెరుగుపచ్చడి

ABN, First Publish Date - 2017-04-08T20:42:48+05:30

కావాల్సిన పదార్థాలు పెరుగు : 1/2 కప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు
 
పెరుగు : 1/2 కప్పు   
పసుపు: కొద్దిగా
ఆవాలు: అర టీస్పూను
జీలకర్ర: పావు టీస్పూను
ఎండు మిరపకాయలు: 1-2
ఇంగువ: చిటికెడు (తప్పనిసరికాదు)
కరివేపాకు ఆకులు: 8-10
పచ్చిమిరపకాయలు:1-2 (సన్నగా తరిగి)
పొట్లకాయ :పెద్దది ఒకటి
కొత్తిమీర: టేబుల్‌స్పూన్‌
ఉప్పు తగినంత
ఆయిల్‌ లేదా నెయ్యి: రెండు టీస్పూన్లు
 
 
తయారీ విధానం

ఒక గిన్నెలో పావు కప్పు నీరు తీసుకుని అందులో పెరుగును వేసి చిక్కటి మజ్జిగలా చేయాలి. అందులోనే పసుపు, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో నెయ్యి లేదా నూనెను వేసి వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడుతుండగా అందులో మినప్పప్పు కూడా వేసి లేత బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేగనివ్వాలి. తర్వాత అందులో ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, పొట్లకాయముక్కలు వేయాలి. ఓ మాదిరి మంట మీద పొట్లకాయ ముక్కలు మెత్తగా అయ్యేవర కూ ఉడకనివ్వాలి. పొట్లకాయముక్కలు మెత్తగా అయిన తర్వాత స్టవ్‌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని చిక్కగా చేసి పెట్టుకున్న మజ్జిగలో కలపాలి. ఆ తర్వాత దానిపై కొత్తిమీర చల్లి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2017-04-08T20:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising