ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలకూర, మెంతి మలయ్‌ పన్నీర్‌

ABN, First Publish Date - 2017-12-09T22:29:42+05:30

ఆవనూనె- రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పులు-పావుకప్పు, జీలకర్ర-అర టీస్పూను, లవంగాలు, వెల్లుల్లి-2...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
ఆవనూనె- రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పులు-పావుకప్పు, జీలకర్ర-అర టీస్పూను, లవంగాలు, వెల్లుల్లి-2 (సన్నగా తరిగి), ఉల్లిపాయ-సగం (సన్నగా తరిగి), లేతపాలకూర-కొద్దిగా, మెంతి ఆకు- నాలుగు కప్పులు(సన్నగా తరిగి), పనీర్‌- కొద్దిగా (తరుగు), పచ్చిబటానీలు- అరకప్పు, మీగడ- పావుకప్పు, ఉప్పులేని వెన్న- రెండు టేబుల్‌స్పూన్లు, కారం, గరంమసాలా, ధనియాలపొడి, జీలకర్రపొడి, పసుపు- ఒక్కోటి అర టీస్పూను చొప్పున, తొక్క తీసిన టొమాటోలు-3(బాగా కడిగి చేతితో చిదిమి), ఉప్పు- రుచికి సరిపడా.
 
తయారీ విధానం
పెద్దమంట మీద నూనె వేడిచేయాలి. అందులో జీడిపప్పు, జీలకర్రలను సువాసన వచ్చేవరకూ వేగించాలి. ఉల్లి, వెల్లుల్లి ముక్కలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేదాకా వేగించాలి. పాలకూర, మెంతికూర ఇందులో వేసి రెండు నిమిషాలపాటు మగ్గనివ్వాలి. తర్వాత అందులో పనీర్‌, పచ్చి బఠానీలు (ఫ్రిజ్‌లోంచి తీసినవి), మీగడ, వెన్న, కారం, గరంమసాలా, ధనియాలు, జీలకర్రపొడి, పసుపు, టొమాటోలు, ఉప్పు వేసి పావు కప్పు నీళ్లు పోసి ఉడకనివ్వాలి. పాన్‌ మీద మూతపెట్టి సన్నని మంటపై కూరను ఉడకనివ్వాలి. అది దగ్గర పడే వరకు అంటే దాదాపు అరగంట పాటు స్టవ్‌ మీద ఉంచాలి. నీరు ఇంకిపోయే వరకూ కూరను మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఈ కర్రీని నాన్‌తో తింటే చాలా బాగుంటుంది.

Updated Date - 2017-12-09T22:29:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising