ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెన్న ఉండలు

ABN, First Publish Date - 2017-08-12T18:58:53+05:30

మైదా, పంచదార - ఒక్కో కప్పు చొప్పున, బియ్యప్పిండి - పావు కప్పు, వెన్న - 25 గ్రాములు, నూనె - వేగించడానికి సరిపడా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి:
మైదా, పంచదార - ఒక్కో కప్పు చొప్పున, బియ్యప్పిండి - పావు కప్పు, వెన్న - 25 గ్రాములు, నూనె - వేగించడానికి సరిపడా, వంటసోడా -చిటికెడు.
 
తయారీ:
మైదా, బియ్యప్పిండి, వెన్న, వంటసోడాలను ఒక గిన్నెలో వేయాలి. అందులో గోరువెచ్చని నీళ్లు పోసి పిండిముద్దలా చేయాలి. దానిపైన తడి బట్ట వేసి ఒక గంటసేపు పక్కన పెట్టాలి. ఆ తరువాత చిన్న చిన్న ఉండలు చేసి వాటి మీద కూడా తడి బట్ట వేసి ఐదు నిమిషాలు ఉంచాలి. పాన్‌లో నూనె వేడి చేశాక వెన్న ఉండల్ని సన్నటి మంట మీద లేత గోధుమరంగుకి వచ్చే వరకు వేగించాలి. వేగిన ఉండల్ని చల్లారనివ్వాలి. ఈ లోపు పంచదార మునిగే అన్ని నీళ్లు పోసి తీగపాకం వచ్చేంతవరకు వేడిచేయాలి.
పాకం రెడీ అయ్యిందా లేదా తెలుసుకునేందుకు ఒక ప్లేట్‌లో నీళ్లు పోసి అందులో ఒక చుక్క పాకం వేయాలి. అది కరిగిపోకుండా ఉంటే పాకం రెడీ అయినట్టు. అప్పుడు స్టవ్‌ ఆపేసి వేగించిన వెన్న ఉండల్ని పంచదార పాకంలో వేసి గరిటెతో కొంచెం సేపటి వరకు ఆపకుండా కలపాలి.

Updated Date - 2017-08-12T18:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising