ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాగాయ

ABN, First Publish Date - 2017-05-06T16:33:38+05:30

మామిడికాయలు-5, కారం- అర కప్పు, ఉప్పు- అర కప్పు, మెంతులు- 2 టీస్పూన్లు, పసుపు- 2 టీస్పూన్లు, ఆవాలు- 2 టేబుల్‌స్పూన్లు, నువ్వుల నూనె- 200 ఎంఎల్‌, ఇంగువ- 1 టీస్పూను, వెల్లుల్లిపాయలు-20.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు-5, కారం- అర కప్పు, ఉప్పు- అర కప్పు, మెంతులు- 2 టీస్పూన్లు, పసుపు- 2 టీస్పూన్లు, ఆవాలు- 2 టేబుల్‌స్పూన్లు, నువ్వుల నూనె- 200 ఎంఎల్‌, ఇంగువ- 1 టీస్పూను, వెల్లుల్లిపాయలు-20.
 
తయారీ: మామిడికాయల తొక్క తీసేశాక కాయల్ని సన్నటి ముక్కలుగా తరగాలి. ఎంత సన్నటి ముక్కలయితే అంత త్వరగా ఎండుతాయి. మామిడికాయముక్కల్లో పైన చెప్పిన కొలతల ప్రకారం ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూడు రోజుల పాటు కదపకుండా ఉంచాలి. మామిడికాయ ముక్కల నుంచి రసం బాగా ఊరుతుంది. నాలుగోరోజు రసంలోని మామిడికాయముక్కలను పిండి (మామిడికాయ ముక్కల్ని పిండేటప్పుడు వచ్చే రసాన్ని పారబోయొద్దు) పొడిగా, శుభ్రంగా ఉన్న ఒక ప్లాస్టిక్‌ షీటు మీద ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల ముక్కల్లోని తేమంతా పోయి మృదువుగా అవుతాయి. మామిడి ముక్కల్ని ఎండలో ఎక్కువసేపు ఉంచితే గట్టిగా అవుతాయి.
 
ఐదవరోజు కడాయిలో నువ్వుల నూనె వేడిచేసి అందులో ఆవాలు వేయాలి. అవి వేగాక ఇంగువపొడిని వేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద నుంచి కడాయి దించి చల్లార్చాలి. మెంతుల్ని వేగించి మెత్తటి పొడి చేయాలి. తర్వాత కారం, మెంతులపొడి, వెల్లుల్లిపాయల్ని మామిడికాయముక్కలరసంలో కలిపి మామిడిముక్కలపై పోయాలి. నూనె తక్కువైంది అనిపిస్తే పావు కప్పు నువ్వుల నూనె వేడిచేసి అందులో కలపొచ్చు. ఈ మాగాయ ఊరడానికి వారం రోజులు పడుతుంది. ఆ తర్వాత దాన్ని నెయ్యి వేసిన అన్నంతో తింటే మహారుచిగా ఉంటుంది. మాగాయ, పెరుగన్నం కాంబినేషన్‌ అయితే మరింత టేస్టీ...

Updated Date - 2017-05-06T16:33:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising