ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెంతి పచ్చడి

ABN, First Publish Date - 2017-04-22T21:36:53+05:30

కావాల్సిన పదార్థాలు మెంతులు-1/2 కప్పు (రాత్రి నీళ్లల్లో నానబెట్టాలి)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు
 
మెంతులు-1/2 కప్పు (రాత్రి నీళ్లల్లో నానబెట్టాలి)
ఖర్జూరాలు- 1/2 కప్పు (సన్నని ముక్కలుగా తరగాలి)
ఎండుద్రాక్ష- 1/2 కప్పు (చిన్నచిన్న ముక్కలు)
సోంపు- 2 టేబుల్‌స్పూన్లు
ఎర్రమిర్చి పొడి- 1 టేబుల్‌స్పూన్‌
అల్లం పొడి- 1 టేబుల్‌స్పూను (డై)
ధనియాల పొడి-1 టేబుల్‌స్పూన్‌
జీలకర్ర పొడి- 1 టేబుల్‌స్పూన్‌ (వేయించినవి)
ఆమ్‌చూర్‌ పొడి- 2 టేబుల్‌స్పూన్లు
ఉప్పు- సరిపడినంత, బెల్లం లేదా చక్కెర- రుచికి సరిపడినంత
లవంగాలు, దాల్చినచెక్క, జాజికాయ పొడి- అన్నీ చిటికెడు
 
 
తయారీ విధానం
 
రెండు కప్పుల నీళ్లల్లో ఉప్పు వేసి నానబెట్టిన మెంతులతోపాటు సోంపు, ఎండుద్రాక్ష, ఖర్జూరం ముక్కలను అందులో వేసి బాగా గ్రైండ్‌ చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ప్రెషర్‌ కుక్కర్‌లో పెట్టి మెత్తగా అవనివ్వాలి. కాసేపైన తర్వాత ప్రెషర్‌ కుక్కర్‌ మూత తీసి దాన్ని చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆ మిశ్రమానికి మిగతా పదార్థాలనన్నింటినీ జోడించి అది దగ్గర పడేవరకూ చిన్నమంట మీద ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల అది జామ్‌లా తయారవుతుంది. అప్పుడు ఆ చట్నీని కొద్దిగా పల్చగా చేయాలి. అందులో బెల్లం లేదా చక్కెర వేస్తే ఈ సిరప్‌ చెట్నీ సువాసనలు వెదజల్లుతూ నోరూరిస్తుంది. పచ్చడి చేదుగా ఉన్నట్టనిపిస్తే దాంట్లో కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు.

Updated Date - 2017-04-22T21:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising