ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాప్‌కార్న్‌ చికెన్‌

ABN, First Publish Date - 2017-03-11T18:02:41+05:30

బోన్‌లెస్‌ చికెన్‌ ఫిల్లెట్‌ - 300 గ్రాములు, మొక్కజొన్నపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, గుడ్డు - ఒకటి, బ్రెడ్‌ క్రంబ్స్‌, కార్న్‌ ఫ్లేక్స్‌, ఓట్స్‌ (కచ్చాపచ్చాగా మిక్సీ చేసి)ల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలతకు 240 మి.లీ కప్పు ఉపయోగించాలి.
 
కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్‌ చికెన్‌ ఫిల్లెట్‌ - 300 గ్రాములు, మొక్కజొన్నపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, గుడ్డు - ఒకటి, బ్రెడ్‌ క్రంబ్స్‌, కార్న్‌ ఫ్లేక్స్‌, ఓట్స్‌ (కచ్చాపచ్చాగా మిక్సీ చేసి)ల్లో వేటినైనా వాడొచ్చు - ఒక కప్పు, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - పావు టీస్పూన్‌, నూనె - వేగించడానికి సరిపడా, ముప్పావు టీస్పూన్‌ - అల్లం వెల్లుల్లి పేస్ట్‌, నల్లమిరియాలు - పావు టీస్పూన్‌, ఉల్లిపాయల పొడి - అర టీస్పూన్‌ గరం మసాలా - కొద్దిగా, కారం - అర టీస్పూన్‌.
 
 
తయారీ విధానం:
చిన్న చిన్న ముక్కలుగా కోసి నీళ్లతో శుభ్రంగా కడిగి వడకట్టాలి.
కారం, నల్లమిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, మసాలా, ఉప్పులను ముక్కల్లో వేసి బాగా కలపాలి.
గుడ్డు, మొక్కజొన్న పిండి వేసి ముక్కలన్నింటికీ బాగా పట్టేలా కలపాలి.
ఆ తరువాత బ్రెడ్‌ క్రంబ్స్‌ను వేసి కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి. లేదంటే ఒక్కో ముక్కను బ్రెడ్‌ క్రంబ్స్‌లో వేసి దొర్లించొచ్చు. పావుగంట వాటిని అలానే ఉంచితే బ్రెడ్‌ పొడి ముక్కలకి బాగా అంటుకుపోతుంది.
నూనె వేడిచేసి అందులో ఈ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. మధ్యమధ్యలో కదుపుతూ వేగిస్తే ముక్కలు బాగా వేగుతాయి.

Updated Date - 2017-03-11T18:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising