ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిసిబేళాబాత్‌

ABN, First Publish Date - 2017-11-11T17:59:42+05:30

బియ్యం - ఒక కప్పు, కందిపప్పు - అర కప్పు, చింతపండు - కొద్దిగా, ఉల్లిపాయ - ఒకటి, మునగకాయ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సినవి
 
బియ్యం - ఒక కప్పు, కందిపప్పు - అర కప్పు, చింతపండు - కొద్దిగా, ఉల్లిపాయ - ఒకటి, మునగకాయ - ఒకటి, బీన్స్‌ - పది, క్యారెట్‌ - రెండు, బంగాళదుంప - ఒకటి, క్యాప్సికం - ఒకటి, పసుపు - అర టీ స్పూన్‌, ఇంగువ - చిటికెడు, కొత్తిమీర - ఒక టేబుల్‌ స్పూన్‌(తరిగినది), జీడిపప్పు పలుకులు - పది, సాంబార్‌ పొడి - ఒక టీ స్పూన్‌
మసాలా కోసం: ధనియాలు - రెండు టీ స్పూన్‌లు, మినపప్పు - ఒక టీ స్పూన్‌, ఎండు మిర్చి - రెండు, జీలకర్ర - ఒక టీ స్పూన్‌, మెంతులు - ఒక టీ స్పూన్‌, దాల్చిన చెక్క - కొద్దిగా, లవంగాలు - రెండు, నూనె - తగినంత, ఉప్పు - రుచికి సరిపడా, పోపు దినుసులు - ఒక టేబుల్‌ స్పూన్‌.
 
తయారివిధానం
 
ముందుగా పోపు దినుసులు నూనెలో దోరగా వేగించాలి. చల్లారాక పొడి చేయాలి. తరువాత బియ్యం, పప్పులో తగినంత నీరు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. చింతపండుని నానబెట్టి గుజ్జుతీయాలి. మునగకాయ, బీన్స్‌, క్యారెట్‌, బంగాళా దుంప, క్యాప్సికంలను విడిగా ఉడికించాలి. ఒక పాత్రలో ఉడికించిన కూరగాయలు, మసాలా పొడి వేసి బాగా కలపాలి. అందులోనే చింతపండు గుజ్జు, ఉప్పు వేసి, నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి. ఆవాలు, జీలకర్ర, ఇంగువతో పోపు వేసి, ఉడుకుతున్న మిశ్రమంలో కలపాలి. జీడిపప్పులు, కరివేపాకులు నెయ్యిలో వేగించి గార్నిష్‌ చేయాలి.

Updated Date - 2017-11-11T17:59:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising