ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థాయ్‌ పైనాపిల్‌ ఫ్రైడ్‌ రైస్‌

ABN, First Publish Date - 2017-04-01T20:56:56+05:30

కావలసిన పదార్థాలు పైనాపిల్‌ ముక్కలు- ఒక కప్పు, సగం ఉడకబెట్టిన అన్నం- మూడు కప్పులు, తరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
పైనాపిల్‌ ముక్కలు- ఒక కప్పు, సగం ఉడకబెట్టిన అన్నం- మూడు కప్పులు, తరిగిన ఉల్లిపాయలు- రెండు, ఎండుమిర్చి- రెండు, వెల్లుల్లి రెబ్బలు- మూడు, కోడిగుడ్డు- ఒకటి, పనీర్‌- మూడు టేబుల్‌ స్పూన్లు, సోయాసాస్‌- మూడు టేబుల్‌ స్పూన్లు, కారం- ఒక టేబుల్‌ స్పూను, మిరియాలు- మూడు, జీడిపప్పు- పావు కప్పు, బఠాణీలు, ఎండుద్రాక్ష- పావు కప్పు చొప్పున, కొత్తిమీర- కొద్దిగా, చక్కెర- ఒక టీ స్పూను, నూనె- ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
 
ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయలు, వెల్లుల్లి, మిరియాలు, ఎండుమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేగించాలి. తర్వాత గుడ్డు పగులకొట్టి వేసి వేగించాలి. తర్వాత సోయాసాస్‌, కారం, చక్కెర, జీడిపప్పు వేసి అర నిమిషం పాటు వేగించాలి. ఆ తర్వాత అన్నం, ఉప్పు వేసి చిన్నమంట మీద 3 నిమిషాలు వేగించాలి. తర్వాత పైనాపిల్‌ ముక్కలు, ఎండుద్రాక్ష, బఠాణీలు కూడా వేసి మరో 5 నిమిషాలు వేగించాలి. చివర్లో కొత్తిమీర చల్లి దించేయాలి. కారం, తీపి కలగలిసిన రుచి ఇష్టపడేవారికి ఇది చాలా
బాగుంటుంది.

Updated Date - 2017-04-01T20:56:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising