ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పైసీ దహీ కఢీ

ABN, First Publish Date - 2017-02-25T17:04:35+05:30

వేడికి సరైన సమాధానం పెరుగు చెప్తుంది. క్యాల్షియం, ప్రొటీన్‌లను నింపుకున్న పెరుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేడికి సరైన సమాధానం పెరుగు చెప్తుంది. క్యాల్షియం, ప్రొటీన్‌లను నింపుకున్న పెరుగు శరీరాన్ని చల్లబరిచి, జీర్ణక్రియను క్రమపరుస్తుంది. అలాగే అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లను అందిస్తుంది.
 
కావలసినవి
కఢీ కోసం: పుల్లటి పెరుగు - ఒక కప్పు, నీళ్లు - రెండు కప్పులు, శెనగపిండి - రెండు టేబుల్‌ స్పూన్లు, పసుపు - పావు టీస్పూన్‌, ఉప్పు - రుచికి సరిపడా.
 
తాలింపునకు: నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు (నెయ్యి వాడితే ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌), ఆవాలు - అర టీస్పూన్‌, మెంతులు - పావు టీ స్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, బిర్యానీ ఆకు - ఒకటి, ఇంగువ - చిటికెడు, కారం - పావు టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు.
 
తయారీవిధానం
కఢీ కోసం పేర్కొన్న పదార్థాలన్నింటినీ ఒకపాన్‌లో వేసి ఉండలు లేకుండా మెత్తగా కలపాలి.
సన్నటి మంట మీద పాన్‌ ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ ఆరునిమిషాలు లేదా శెనగపిండి ఉడికే వరకు ఉంచాలి.
కఢీ మరీ చిక్కగా, పలుచగా కాకుండా జాగ్రత్తపడాలి. తయారయ్యాక మూత పెట్టి పక్కన పెట్టాలి.
 
చివరిగా:
చిన్న పాన్‌లో నెయ్యి లేదా నూనె వేడిచేసి ఆవాలు, బిర్యానీ ఆకు వేయాలి. ఆవాలు చిటపటమంటున్నప్పుడు జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ వేయాలి. ఎండుమిర్చి రంగు మారుతున్నప్పుడు మంట ఆపేయాలి.
కారం వేసి కలిపి వెంటనే తాలింపు వేసి మూతపెట్టాలి. ఐదు నిమిషాల తరువాత మరోసారి కలిపి అన్నం, పుల్కా లేదా జీరా రైస్‌లతో తింటే బాగుంటుంది.
గ్లూటెన్‌ ఫ్రీ కఢీ కావాలంటే ఇంగువ వేసుకోకపోతే సరి.

Updated Date - 2017-02-25T17:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising