ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్‌ బిర్యానీ

ABN, First Publish Date - 2017-12-30T18:37:53+05:30

బాసుమతి బియ్యం- ఒకటిన్నర కప్పు, చికెన్‌- అర కేజి, బిర్యానీ మసాలా పొడి-అర టీస్పూను, పెద్ద ఉల్లిపాయ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
బాసుమతి బియ్యం- ఒకటిన్నర కప్పు, చికెన్‌- అర కేజి, బిర్యానీ మసాలా పొడి-అర టీస్పూను, పెద్ద ఉల్లిపాయ-1 (సన్నటి ముక్కలుగా తరిగి నూనెలో వేగించాలి), సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీన- గుప్పెడు, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లేదా నెయ్యి- మూడు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు- పావు టీస్పూన్లు (మూడు టేబుల్‌స్పూన్ల వేడిపాలల్లో నానబెట్టాలి).
 
తయారీ విధానం
అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చిముక్కలు, పసుపు, పెరుగు, నిమ్మరసం, కారం, బిర్యానీ మసాలా పొడి, గ్రీన్‌ యాలకుల పొడి, ఉప్పు వేసి మసాలా చికెన్‌కు బాగా పట్టేలా కలపాలి. ఆ మిశ్రమాన్ని రెండు గంటలపాటు అలాగే ఉంచాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టాలి. కుక్కర్‌లో నీళ్లు పోసి వేడిచేయాలి. అందులో ఉప్పు, ఎండుమసాలా, ఒక టీస్పూను నూనె వేయాలి. తర్వాత అందులో నానబెట్టిన బియ్యాన్ని పోసి మూడొంతులు ఉండనివ్వాలి. అన్నం ఉడికిన తర్వాత, ఊరబెట్టిన చికెన్‌ని నాన్‌స్టిక్‌ పాన్‌లో వేయాలి. అందులో ముందుగానే వేగించి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తరుగును వేడి నెయ్యిలో వేసి బాగా కలపాలి. ఉడికిన అన్నాన్ని చికెన్‌పై ఒక పొరలా వేసి దానిపై వేగించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. దానిపై అర టీస్పూను బిర్యానీ పొడి చల్లాలి. వేగించిన ఉల్లిపాయలు, అన్నం, కొత్తిమీర, పుదీనా మిశ్రమాన్ని చికెన్‌పై మరో పొరలా పరచాలి. దీనిపై కుంకుమపువ్వు నానబెట్టిన పాలను చిలకరించాలి. ఆవిరి బయటకుపోకుండా పాన్‌ అంచులకు గుడ్డతో కట్టి మూతపెట్టాలి. తర్వాత గుడ్డతో మరో పొరను పాన్‌పై వేసి మూతపెట్టాలి. పాన్‌ను వేడిగా ఉన్న తవా మీద పెట్టి మంట మధ్యస్థంగా కన్నా కొద్దిగా ఎక్కువ ఉండేలా పెట్టాలి. అలా స్టవ్‌ మీద 20 నిమిషాలు ఉంచిన తర్వాత ఆ గుడ్డ నిండా ఆవిరి పరుచుకోవడం చూడొచ్చు. మంటను బాగా తగ్గించి 15 నిమిషాలు స్టవ్‌ మీద ఉంచాలి. కిందికి దించి అరగంటసేపు కదల్చకుండా అలాగే ఉంచితే చికెన్‌ బిర్యానీ రెడీ.


Updated Date - 2017-12-30T18:37:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising